మూడు వన్డేల టీ20 సిరీస్ కోసం సన్నాహాలు చేసుకుంటున్నాయి భారత్-శ్రీలంక. ఇప్పటికే తొలి మ్యాచ్ కోసం గువహటి చేరుకున్నాయి ఇరుజట్లు. తొలి మ్యాచ్ గెలిచి, కొత్త ఏడాదిని ఘనంగా ఆరంభించాలని చూస్తున్నాయి. కోహ్లీ సారథ్యంలోని టీమిండియా, లసిత్ మలింగ నేతృత్వంలోని లంక... మైదానం వద్ద హోటళ్లకు చేరుకున్నాయి. అయితే ఈ పోరుకు అభిమానులు ఎంతమంది హాజరవుతారనేది కీలకంగా మారింది. ఇప్పటికే అసోం వ్యాప్తంగా పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నాయి. వాటి ప్రభావం అభిమానుల రాకపై ఉంటుందనేది చర్చనీయాంశంగా మారింది.
-
Sri Lanka T20I squad led by Lasith Malinga left the island this morning for India to take part in the 3-match T20I series. #INDvSL pic.twitter.com/iRtIUgX0mU
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) January 2, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Sri Lanka T20I squad led by Lasith Malinga left the island this morning for India to take part in the 3-match T20I series. #INDvSL pic.twitter.com/iRtIUgX0mU
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) January 2, 2020Sri Lanka T20I squad led by Lasith Malinga left the island this morning for India to take part in the 3-match T20I series. #INDvSL pic.twitter.com/iRtIUgX0mU
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) January 2, 2020
పటిష్ట బందోబస్తు మధ్య మ్యాచ్ జరగనుంది. అసోం క్రికెట్ సంఘంతో పాటు భారత క్రికెట్ బోర్డు(బీసీసీఐ).. దీనిపై ఓ కన్నేసి ఉంచుతోంది.
ఈ సిరీస్ కోసం భారత జట్టులోని సీనియర్ బ్యాట్స్మన్ రోహిత్ శర్మకు విశ్రాంతినిచ్చారు సెలక్టర్లు. మరో ఓపెనర్ శిఖర్ ధావన్, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా జట్టులో చోటు దక్కించుకున్నారు.
లంకేయులూ సిద్ధం
లంక జట్టుకు సీనియర్ పేసర్ లసిత్ మలింగ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ సిరీస్ కోసం 16 మందితో భారత గడ్డపై అడుగుపెట్టింది శ్రీలంక. దాదాపు 16 నెలల విరామం తర్వాత ఆ జట్టు ఆల్‌రౌండర్ ఏంజెలో మాథ్యూస్.. మళ్లీ పొట్టి ఫార్మాట్లో అడుగుపెడుతున్నాడు.
ఈ నెల 5న గువహటి వేదికగా తొలి టీ20 మ్యాచ్.. 7న ఇండోర్, 10న పుణె వేదికగా ఆఖరి టీ20 నిర్వహించనున్నారు.
జట్లు
భారత్:
విరాట్ కోహ్లీ (కెప్టెన్), శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), మనీశ్ పాండే, సంజు శాంసన్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, చాహల్, కుల్దీప్ యాదవ్, శార్దుల్ ఠాకూర్, నవదీప్ సైనీ, జస్ప్రీత్ బుమ్రా.
శ్రీలంక:
లసిత్ మలింగ (కెప్టెన్), దనుష్క గుణతిలక, అవిష్క ఫెర్నాండో, ఏంజెలో మాథ్యూస్, దసన్ శనక, కుశాల్ పెరీరా, నిరోషన్ డిక్వెలా, ధనంజయ డి సిల్వా, ఇసురు ఉదాన, భానుక రాజపక్స, ఒషాద ఫెర్నాండో, వనిందు హసరంగ, లాహిరు కుమార, కుశాల్ మెండిస్, లక్షణ్ సందకన్, కసున్ రజిత.