ఐసీసీ సోమవారం వెల్లడించిన వన్డే ర్యాంకింగ్స్‌లో భారత మహిళా జట్టు రెండో స్థానాన్ని కాపాడుకుంది. 125 పాయింట్లతో ఉన్న మిథాలీ సేన... ఇంగ్లాండ్ జట్టు కంటే 3 పాయింట్లు ముందంజలో ఉంది. టీ20ల్లో మాత్రం భారత్ 5వ స్థానంలో కొనసాగుతోంది.
వన్డేలు, టీ20ల్లో ఆస్ట్రేలియా జట్టు అగ్రస్థానంలో ఉంది. గతేడాది అక్టోబర్ నుంచి కంగారూ జట్టు తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. 6, 7 స్థానాల కోసం వెస్టిండీస్, పాకిస్థాన్ జట్ల మధ్య పోటీ నెలకొంది. ఇద్దరి మధ్య రెండు పాయింట్ల అంతరమే ఉంది.
టీ20ల్లో థాయ్ దూకుడు...
ఐసీసీ మహిళా టీ20 వరల్డ్‌కప్ నెగ్గిన ఆస్ట్రేలియా... పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. రెండో ర్యాంకులో ఉన్న ఇంగ్లాండ్ కొనసాగుతోంది. ఈ రెండు జట్ల మధ్య 10 పాయింట్ల అంతరం మాత్రమే ఉంది. ఈ పట్టికలో గతంలో 46 జట్లే ఉండేవి వాటి సంఖ్యను 58కి పెంచింది ఐసీసీ.
ఇటీవల పొట్టి ఫార్మాట్లో 17 మ్యాచ్‌లు వరుసగా గెలిచిన థాయ్‌లాండ్ జట్టు... టాప్-10లో చోటు సంపాదించుకుంది. ఈ ఏడాది జరిగిన 25 మ్యాచ్‌ల్లో 21 టీ-ట్వంటీలు గెలుపొందింది థాయ్ జట్టు. అంతేకాకుండా వచ్చే ఏడాది ఆసీస్‌లో జరగనున్న మహిళా టీ20 ప్రపంచకప్‌కూ అర్హత సాధించింది. పసికూన జట్లు డెన్మార్క్(40), మెక్సికో (41) స్థానాల్లో కొనసాగుతున్నాయి.
ఇదీ చదవండి...