టీమ్ఇండియాతో జరగనున్న నాలుగో టెస్టుకు ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ సామ్ కరన్ అందుబాటులో ఉండడని ఇంగ్లీష్ క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. ఫిబ్రవరి 26న ప్రత్యేక విమానంలో భారత్‌కు పయనమవుతున్న సామ్ కరన్.. చివరి టెస్టుకు కాకుండా టీ20 సిరీస్‌లో ఆడతాడని ఆ దేశ బోర్డు వెల్లడించింది.
"సామ్ కరన్ ఫిబ్రవరి 26న ఇంగ్లాండ్ నుంచి ప్రత్యేక విమానంలో భారత్‌కు చేరుకుంటాడు. టీమ్ఇండియాతో మార్చి 4న జరగనున్న ఆఖరి టెస్టులో అతడు ఆడాల్సి ఉంది. ప్రయాణ అడ్డంకుల వల్ల అతడు నాలుగో టెస్టులో అందుబాటులో ఉండడం లేదు. కానీ, టీ20 సిరీస్‌లో ఆడతాడు".
- ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు
టీమ్ఇండియాతో మిగిలిన రెండు టెస్టుల్లో ఆడాల్సిన ఆటగాళ్ల జాబితాను ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఇటీవలే ప్రకటించింది. ఆ జట్టు కూర్పు వివరాలు..
ఇంగ్లాండ్ జట్టు: జో రూట్ (కెప్టెన్), జేమ్స్ అండర్సన్, జోఫ్రా ఆర్చర్, జానీ బెయిర్‌స్టో, డొమినిక్ బెస్, స్టువర్ట్ బ్రాడ్, రోరే బర్న్స్, జాక్ క్రావ్లే, బెన్ ఫోక్స్, డాన్ లారెన్స్, జాక్ లీచ్, ఓల్లీ పోప్, డోమ్ సిబ్లీ, బెన్ స్టోక్స్, ఒల్లీ స్టోన్, క్రిస్ ఓక్స్, మార్క్ వుడ్.
నాలుగు టెస్టుల సిరీస్‌లో భారత్, ఇంగ్లాండ్ జట్లు చెరో మ్యాచ్‌లో నెగ్గి.. సిరీస్‌ను సమం చేశాయి.
ఇదీ చూడండి: ఇంగ్లాండ్ X టీమ్ఇండియా: మూడో వన్డే వేదిక మార్పు!