టీమిండియా క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ.. వికెట్ కీపింగ్ స్కిల్స్ గురించి ఎంతచెప్పుకున్న తక్కువే. స్టంప్స్ వెనక అతడు చేసే మ్యాజిక్కులు.. జిమ్మిక్కులకు అభిమానులు ఎప్పుడూ ఫిదానే. సరిగ్గా అదే రీతిలో ఇంగ్లాండ్ కీపర్ శామ్ బిల్లింగ్స్ చక్కటి రనౌట్ చేశాడు. ఈడెన్ పార్క్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రాస్ టేలర్‌ను పెవిలియన్‌కు పంపాడు.
-
WATCH
— Waseem (@Waseem_Aus) November 10, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Ross Taylor Wicket
And England need 147 in just 11 overs to win #NZvENG T20I series after New Zealand run riot in rain-reduced decider.#ENGvNZ pic.twitter.com/45q9NM8wbh
">WATCH
— Waseem (@Waseem_Aus) November 10, 2019
Ross Taylor Wicket
And England need 147 in just 11 overs to win #NZvENG T20I series after New Zealand run riot in rain-reduced decider.#ENGvNZ pic.twitter.com/45q9NM8wbhWATCH
— Waseem (@Waseem_Aus) November 10, 2019
Ross Taylor Wicket
And England need 147 in just 11 overs to win #NZvENG T20I series after New Zealand run riot in rain-reduced decider.#ENGvNZ pic.twitter.com/45q9NM8wbh
ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఆఖరి ఓవర్ వేసిన ఇంగ్లాండ్ బౌలర్ శామ్ కరన్.. చివరి బంతికి యార్కర్ సంధించాడు. క్రీజులోని రాస్ టేలర్ బ్యాక్వార్డ్ స్క్వేర్ లెగ్ దిశగా కొట్టి సింగిల్ తీశాడు. అవతలి వైపున్న నీషమ్‌ను రెండో పరుగు కోసం పిలిచాడు.
ఇంతలో కీపర్ బిల్లింగ్స్.. టేలర్ రెండో పరుగు పూర్తి చేయకముందే వికెట్లను గీరాటేశాడు. స్టంప్‌లను చూడకుండా బంతిని నెట్టిన బిల్లింగ్స్ తీరు అందరినీ ఆశ్చర్యపరిచంది. ధోనీని తలపించింది.
ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ విజేతగా నిలిచింది. ఐదు టీ20ల సిరీస్‌ను 3-2 తేడాతో సొంతం చేసుకుంది.
కీలకమైన ఆఖరి మ్యాచ్ డ్రాగా ముగియడం వల్ల సూపర్ ఓవర్‌తో ఫలితం తేలింది. 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' బెయిర్ స్టో (ఇంగ్లాండ్), 'మ్యాన్ ఆఫ్ ద సిరీస్'గా సాంటర్న్(కివీస్) నిలిచారు.
ఇదీ చదవండి: టీ20: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్