బంతి మెరుపు కోసం లాలాజలాన్ని నిషేధిస్తే బౌలర్లు రోబోలుగా మారతారని ఐసీసీని హెచ్చరించాడు పాకిస్థాన్ మాజీ బౌలర్ వసీం అక్రమ్. బంతిని స్వింగ్ చేసేందుకు చెమట లేదా సలైవా బౌలర్లకు ఎంతగానో ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం మార్చిన నిబంధనలు బ్యాట్స్‌మెన్‌కు అనుకూలంగా ఉన్నాయని చెప్పాడు.
"బంతి మెరుపుకోసం లాలాజలాన్ని వినియోగాన్ని నిషేధిస్తే, బౌలర్లు రోబోలుగా మారతారు. బంతిని స్వింగ్ చేసేందుకు నాది అదే పద్ధతే. నాకైతే ఎటూ తేల్చుకోలేని పరిస్థితి ఇది. కరోనా సంక్షోభ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ స్వింగ్ కావడానికి, ఇక బంతి మెరుపు పోయేంతవరకు వేచిచూడక తప్పదు. కొన్ని దేశాల్లో చల్లటి వాతావరణం ఉండటం వల్ల కనీసం చెమటైనా రాదు. దీనికి ఏదో ఓ ప్రత్యామ్నాయం కావాలనుకుంటున్నా. లేదంటే వాసిలిన్ పూసినా బంతిపై గ్రిప్ వచ్చి స్వింగ్ అవుతుంది. కానీ, అది ఎంత వరకు ఉపయోగిస్తారనేది ప్రశ్న. జులైలో ఇంగ్లాండ్, వెస్టిండీస్ టెస్టు సిరీస్‌లో ఏం జరుగుతుందో చూడాలి"
-వసీం అక్రమ్, పాకిస్థాన్ మాజీ బౌలర్
కరోనా ప్రభావంతో బంతిపై సలైవా పూయడాన్ని తాత్కాలికంగా నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఐసీసీ. ఈ వైరస్‌తో బాధపడే ఆటగాడికి ప్రత్యామ్నాయాన్ని అంగీకరించడం సహా క్రికెటర్లు పాటించాల్సిన కొన్ని మార్గనిర్దేశకాలను తాజాగా విడుదల చేసింది.
ఇదీ చూడండి... శ్రీలంకతో భారత్ పరిమిత ఓవర్ల సిరీస్ వాయిదా