అంతర్జాతీయ క్రికెట్లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్ 100 సెంచరీల రికార్డును విరాట్ కోహ్లీ తిరగరాస్తాడని ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ అభిప్రాయపడ్డాడు. ఇటీవలే తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడిన హాగ్.. అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ పలు విషయాలు పంచుకున్నాడు.
![Sachin's record of 100 centuries can be broken by Virat Kohli: Hogg](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7908848_878_7908848_1594004684607.png)
"కోహ్లీ కచ్చితంగా సాధించగలడు. సచిన్ కాలంతో పోలిస్తే.. ఇప్పుడున్న ఫిట్నెస్ సామర్థ్యాలు చాలా మెరుగ్గా ఉన్నాయి. ట్రైనర్స్ కూడా అలానే ఉన్నారు. చాలా మంది వైద్యులు కూడా ఉన్నారు. కాబట్టి ఆటగాళ్లు మ్యాచ్లను కోల్పోయే అవకాశాలు తక్కువ. ఈ రోజుల్లో చాలా టోర్నీలు ఆడుతున్నారు. అందుకే కోహ్లీ కచ్చితంగా రికార్డు బద్దలు కొట్టగలడు."
-బ్రాడ్ హాగ్, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్
గతంలో జరిగిన ఆస్ట్రేలియా పర్యటనలో టీమ్ఇండియా ప్రదర్శనను గుర్తు చేసుకుంటూ.. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో భారత బౌలర్లు అత్యుత్తమంగా ఉన్నట్లు హాగ్ తెలిపాడు. "భారత పేసర్లు ఇతర జట్ల కంటే వేగంగా వికెట్లు పడగొట్టగలరు. ఇప్పటివరకు వారు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా వంటి ధీటైన జట్లతో తలపడ్డారు. అందుకే టీమ్ఇండియా క్రికెట్లో అత్యుత్తమంగా నిలుస్తోంది." అంటూ వెల్లడించాడు.
![Sachin's record of 100 centuries can be broken by Virat Kohli: Hogg](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7908848_dsasd.jpg)
తెందూల్కర్ తన కెరీర్లో 51 టెస్టు శతకాలు, 49 వన్డే సెంచరీలు సాధించాడు. ప్రస్తుతం కోహ్లీ టెస్టుల్లో 27, వన్డేల్లో 43 సెంచరీలతో మొత్తం 70 అంతర్జాతీయ శతకాలతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ 71 శతకాలతో రెండో స్థానంలో ఉన్నాడు.