భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందుల్కర్, విండీస్ దిగ్గజం బ్రయాన్ లారా.. నెట్టింట సంభాషించుకున్నారు. ఇది ప్రస్తుతం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఇందులో సచిన్ ఓ అరుదైన జ్ఞాపకాన్ని షేర్ చేసుకున్నాడు.
సంభాషణ ఇలా...
లారా.. తన కుమారుడు క్రికెట్ ఆడుతున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. "రైట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్‌గా ఆడుతున్నా.. బ్యాట్ పట్టుకున్న విధానం చూస్తే లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్ అవ్వాలనుకుంటున్నాడు" అని లారా పోస్ట్ చేశాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
దీనికి స్పందించిన సచిన్.. లారా కుమారుడిలాగే బ్యాట్ పట్టుకున్న చిత్రానికి తన చిన్ననాటి ఫేమస్ ఫొటోను కొలేజ్ చేసి పోస్ట్ చేశాడు సచిన్.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
"ఇదే విధంగా బ్యాట్ పట్టుకోగలిగిన ఓ అబ్బాయి నాకు తెలుసు. అతడు అంతర్జాతీయ క్రికెట్లో ఘోరమైన ప్రదర్శనేమి చేయలేదు" అని కామెంట్‌ను జత చేశాడు.
దానికి లారా.. "అవును. ప్రపంచంలోని అత్యుత్తమ బౌలర్లలో కొందరు అతని బ్యాట్ పదును చూశారు. నేను అందులో జోక్యం చేసుకోను" అని నవ్వుతూ సచిన్ ఉద్దేశించి చెప్పాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
మాస్టర్ మళ్లీ స్పందిస్తూ.. "ప్రపంచంలోని గొప్ప బ్యాట్స్మెన్లలో ఒకరి నుంచి తాను క్రికెట్ నేర్చుకోబోతున్నాడు. అతనికి ఉజ్వల భవిష్యత్ ఉంటుంది" అని లారా కుమారుడిని ఉద్దేశించి మాట్లాడాడు సచిన్.
ఇదీ చూడండి... ధోనీ ఆ విషయంలో నన్ను హెచ్చరించాడు: రైనా