ETV Bharat / sports

దిగ్గజ సచిన్​కు ఆటో డ్రైవర్​ సాయం

ఈ సంవత్సరం మొదట్లో జరిగిన ఓ ఆసక్తికర సంఘటన గురించి సచిన్ చెప్పాడు. తనకు రహదారికి మార్గం చెప్పడంలో అతడు ఎలా సహాయపడ్డాడో వివరించాడు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

Sachin Tendulkar Helped By Rickshaw Driver After Losing Direction In Mumbai Suburb
దిగ్గజ సచిన్​కు ఆటో డ్రైవర్​ సాయం
author img

By

Published : Nov 26, 2020, 1:54 PM IST

క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందుల్కర్‌కు ఓ ఆటో డ్రైవర్‌ సాయం చేశాడు. ఈ ఘటన ఈ ఏడాది జనవరిలో జరిగినా ఇప్పుడది వెలుగులోకి వచ్చింది. సచిన్‌, బుధవారం తన ఫేస్​బుక్​లో ఓ వీడియోను పోస్ట్ చేసి ఆ విషయాన్ని వెల్లడించాడు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

అసలేం జరిగిందంటే?

జనవరిలో లిటిల్‌ మాస్టర్‌, ముంబయిలోని సబర్బన్‌ వీధుల్లో తన కారులో ప్రయాణిస్తూ ప్రధాన రహదారికి చేరుకునే మార్గాన్ని మర్చిపోయాడు. అలాంటి పరిస్థితుల్లో పక్కనే వెళ్తున్న ఓ ఆటో డ్రైవర్‌ సచిన్‌ పరిస్థితిని తెలుసుకుని సాయం చేశాడు. ప్రధాన రోడ్డుకు ఎలా వెళ్లాలనే వివరాల్ని చెప్పాడు. దాంతో మాస్టర్‌ ఆ రోడ్డుపైకి చేరుకున్నాక ఆ ఆటోడ్రైవర్‌ని కలిసి మాట్లాడాడు. అతడికి షేక్‌ హ్యాండ్‌ ఇవ్వడమే కాకుండా ఓ సెల్ఫీ తీసుకునే అవకాశాన్ని కల్పించాడు.

'కొద్ది నెలలుగా నెలకొన్న విపత్కర పరిస్థితుల్లో టెక్నాలజీ మనకెంత ఉపయోగపడుతుందో మనం చూస్తున్నాం. కానీ, మనుషుల సాయానికి మించింది ఏదీ లేదు. మనమంతా ఇప్పుడు అలాంటి పరిస్థితులను కోల్పోయాం' అంటూ కరోనాను ఉద్దేశించి సచిన్ వివరించాడు. తనకు సాయం చేసిన ఆటో డ్రైవర్‌ పేరు మంగేశ్‌ అని, అతడితో మరాఠీలో మాట్లాడిన వీడియోను మాస్టర్, అభిమానులతో పంచుకున్నాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.