కరోనా వల్ల గత నెల చివర్లో ఆస్పత్రిలో చేరిన దిగ్గజ క్రికెటర్ సచిన్.. వైరస్ నుంచి కోలుకుని, గురువారం డిశ్చార్జ్ అయ్యాడు. తన ఆరోగ్యం కోసం ఆలోచించిన అభిమానులు, సన్నిహితులు, ఆస్పత్రి సిబ్బందికి మాస్టర్ ధన్యవాదాలు చెప్పాడు. అయితే మరికొన్ని రోజుల పాటు స్వీయ నిర్బంధంలోనే ఉంటానని తెలిపాడు.
గత నెలలో రోడ్ సేఫ్టీ సిరీస్‌లో పాల్గొన్న సచిన్.. ఇండియా లెజెండ్స్‌ను విజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ సిరీస్ పూర్తయిన ఆరు రోజులకు సచిన్ పాజిటివ్‌గా తేలడం వల్ల ఆస్పత్రిలో చేరాడు. ఇతడితో పాటు అందులో పాల్గొన్న ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్, బద్రీనాథ్‌లు కూడా వైరస్ బారిన పడ్డారు.
- — Sachin Tendulkar (@sachin_rt) April 8, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
— Sachin Tendulkar (@sachin_rt) April 8, 2021
">— Sachin Tendulkar (@sachin_rt) April 8, 2021