నవంబర్ 15... దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందూల్కర్ జీవితంలో మర్చిపోలేని తేదీ. సరిగ్గా ఇదే రోజు 1989లో భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. కరాచీ వేదికగా పాకిస్థాన్‌పై అరంగేట్రం చేశాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఈ మ్యాచ్‌లో ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగాడు సచిన్. 15 పరుగులు మాత్రమే చేసి వకార్ యుూనిస్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. భారత్ ఫౌస్ట్ బౌలర్ సలీల్ అంకోలతో పాటు పాక్ క్రికెటర్లు షాహిద్ సయూద్, వకార్ యూనిస్లకు తొలి టెస్టు ఇదే కావడం విశేషం.
క్రికెట్లో ఎన్నో మైలురాళ్లు నెలకొల్పిన సచిన్.. కేవలం 16 ఏళ్ల 205 రోజుల వయసులోనే అంతర్జాతీయ కెరీర్ ప్రారంభించాడు. 24 ఏళ్ల పాటు భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఎందరో యువ క్రికెటర్లకు ఆదర్శంగా నిలిచాడు. ప్రపంచ క్రికెట్లో తనదైన ముద్ర వేశాడు.
మొత్తంగా 200 టెస్టులు ఆడిన సచిన్.. 53.78 సగటుతో 15,921 పరుగులు చేశాడు. ఇందులో 51 సెంచరీలు, 68 అర్ధ శతకాలు ఉన్నాయి.
టెస్టుల్లో సచిన్.. వ్యక్తిగత అత్యధిక స్కోరు 248 నాటౌట్. బౌలర్‌గానూ రాణించి 46 వికెట్లు తీశాడు. ఈ ఫార్మాట్లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గానూ రికార్డు నెలకొల్పాడు.
సచిన్... కెరీర్ ప్రారంభించి, సరిగ్గా 24 సంవత్సరాల తర్వాత 2013 నవంబరు15న ఆటకు వీడ్కోలు ప్రకటించాడు. వాంఖడే స్టేడియంలో(ముంబయి) వెస్టిండీస్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో 74 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు.
ఇది చదవండి: సచిన్ స్ఫూర్తితో లేడీ మాస్టర్‌గా ఎదిగిన షెఫాలీ