ETV Bharat / sports

మహిళా టీమిండియాపై మాజీ క్రికెటర్ల ప్రశంసలు - T20 World Cup campaign

టీ20 ప్రపంచకప్​ను విజయంతో బోణీ కొట్టిన టీమిండియా మహిళలకు అన్నివైపుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. దిగ్గజ సచిన్​ తెందుల్కర్​, సెహ్వాగ్​ సహా పలువురు ట్విట్టర్​ వేదికగా అభినందిస్తున్నారు. మరిన్ని విజయాలతో దూసుకెళ్లాలని ఆకాంక్షిస్తున్నారు.

T20 World Cup 2020
మహిళల టీ20 ప్రపంచకప్​
author img

By

Published : Feb 21, 2020, 8:58 PM IST

Updated : Mar 2, 2020, 2:50 AM IST

మహిళల టీ20 ప్రపంచకప్​లో ఆతిథ్య ఆస్ట్రేలియాకు తొలి మ్యాచ్​లోనే షాకిచ్చింది​ టీమిండియా. శుక్రవారం జరిగిన ఈ పోరులో భారత్.. అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. ఆసీస్‌పై 17 పరుగుల తేడాతో గెలిచింది. స్పిన్నర్ పూనమ్‌ యాదవ్‌ (4 వికెట్లు) విజయంలో కీలక పాత్ర పోషించింది. ఈ సందర్భంగా హర్మన్‌సేనపై భారత మాజీ క్రికెటర్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

>> టీ20 ప్రపంచకప్​లో టీమిండియా అద్భుత ప్రదర్శన చేసింది. మీరు సాధించిన విజయానికి శుభాకాంక్షలు. ఇలానే కొనసాగండి - సచిన్​ తెందుల్కర్​

>> ఇది అద్భుత విజయం. భారత మహిళా జట్టు గొప్పగా ఆడింది. ఆస్ట్రేలియాపై 132 పరుగులను అద్భుతంగా పోరాడి కాపాడుకుంది. హర్మన్‌సేనకు శుభాకాంక్షలు - వీరేంద్ర సెహ్వాగ్‌

>> మెగాటోర్నీలో అదిరే ఆరంభం. తొలి మ్యాచ్‌లోనే ఆతిథ్య జట్టు, డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆస్ట్రేలియాను ఓడించారు. దీప్తి తొలుత స్కోరు బోర్డును ముందుకు నడిపించింది. పూనమ్‌ మ్యాచ్‌ను మలుపు తిప్పింది. మొత్తంగా భారత మహిళా జట్టు గొప్పగా ఆడింది - మహ్మద్‌ కైఫ్‌

  • What a start to the tournament, @BCCIWomen! Beating the hosts and defending champions Australia in the very first game!

    Deepti’s resolve put runs on the board before Poonam Yadav literally ‘turned’ things around! Top stuff, girls! 🇮🇳👏🏼#T20WorldCup #AUSvIND pic.twitter.com/EDRbMVzISK

    — Mohammad Kaif (@MohammadKaif) February 21, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

>> భారత మహిళా జట్టుకు శుభాకాంక్షలు. టీ20 ప్రపంచకప్‌లో ఘనమైన బోణీ. ఆసీస్‌పై 132 పరుగులను కాపాడుకోవడానికి పూనమ్‌ యాదవ్‌, మిగిలిన బౌలర్లు అద్భుతంగా పోరాడారు. తర్వాత మ్యాచ్‌ల్లోనూ బాగా ఆడాలని కోరుకుంటున్నా - వీవీఎస్ లక్ష్మణ్‌

>> ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా ఫేవరేట్‌. కానీ ఇది గొప్ప ఫలితం. భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. దీప్తి శర్మ గొప్పగా బ్యాటింగ్‌ చేసింది. అయితే లెగ్‌ స్పిన్నర్‌ పూనమ్‌ యాదవ్ మ్యాచ్‌ను మలుపు తిప్పింది - హర్షా బోగ్లే

  • Staggering performance by India's women. Australia were favourites for the tournament and this is a huge result. Top effort from the bowlers. How good was Deepti Sharma! But it was the little leggie Poonam Yadav who turned it around. #iccwomenst20worldcup

    — Harsha Bhogle (@bhogleharsha) February 21, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

>> స్పిన్‌తో విజయం.. అదీ ఆస్ట్రేలియాలో. ఆతిథ్య జట్టు, డిఫెండింగ్‌ ఛాంపియన్‌పై తక్కువ స్కోరును కాపాడుకొని 17 పరుగుల తేడాతో విజయం సాధించారు. భారత మహిళా జట్టుకు హ్యాట్సాఫ్‌ - ఆకాశ్‌ చోప్రా

>> ప్రపంచకప్‌లో శుభారంభం. దీప్తిశర్మ (49*) బ్యాటుతో, పూనమ్‌ యాదవ్‌ (4/19), శిఖ పాండే (3/14) బంతితో అదరగొట్టారు - జులన్‌ గోస్వామి

>> అద్భుత విజయం సాధించిన మహిళా జట్టుకు అభినందనలు - మిథాలీ రాజ్‌

ఇవీ చూడండి...

ప్రపంచకప్​: ఆరంభం అదుర్స్​.. ఆసీస్​పై భారత్ విజయం

టీ20 ప్రపంచకప్: బౌలర్ పూనమ్​ మూడో హ్యాట్రిక్​ మిస్​

ధోనీని తలపించిన భాటియా.. ఆసీస్​పై సూపర్​ కీపింగ్​

Last Updated : Mar 2, 2020, 2:50 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.