ETV Bharat / sports

ఆ ఐదు రోజులు ఒకే పాట విన్నా: సచిన్

2004 ఆస్ట్రేలియా​ పర్యటనలో భారత దిగ్గజ బ్యాట్స్​మన్ సచిన్​ తెందుల్కర్​ సిడ్నీ వేదికగా జరిగిన మ్యాచ్​లో 241 పరుగులు చేశాడు. ఈ సమయంలో జరిగిన ఓ ఆసక్తికర విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు మాస్టర్.

author img

By

Published : Dec 11, 2020, 1:35 PM IST

Sachin reveals the name of iconic song he heard on loop during his unbeaten 241 against Australia
ఆ ఐదు రోజులు ఒకే పాట విన్నా: సచిన్

టీమ్ఇండియా దిగ్గజ క్రికెటర్ సచిన్​ తెందుల్కర్​ 2004 ఆస్ట్రేలియా​ పర్యటనలో జరిగిన ఓ ఆసక్తికర విషయాన్ని అభిమానులతో పంచుకున్నాడు. ఈ టూర్​లో నాలుగో టెస్టు మ్యాచ్​లో 241 పరుగులు చేసి ఆ సిరీస్​ను ప్రత్యేకంగా మార్చాడు లిటిల్ మాస్టర్. తాజాగా, ఈ సందర్భాన్ని గుర్తుచేసుకున్న సచిన్​.. 5 రోజులు జరిగిన టెస్టు మ్యాచ్​లో బ్రియాన్ ఆడమ్స్​ పాడిన 'సమ్మర్ ఆఫ్ 69' పాటను తరచూ వినేవాడినని తెలిపాడు.

" 2004 ఆసీస్​ పర్యటనలో సిడ్నీ వేదికగా జరిగిన నాలుగో టెస్టు​ మ్యాచ్​లో 241 పరుగులతో నాటౌట్​గా నిలిచా. ఆ మ్యాచ్​ జరిగిన ఐదు రోజులూ బ్రియాన్ ఆడమ్​ పాడిన 'సమ్మర్​ ఆఫ్​ 69' పాట విపరీతంగా విన్నా. లంచ్​ టైం, టీ టైమ్​ అని తేడా లేకుండా అన్ని వేళలా ఆ పాటే విన్నా. ఆ ఐదు రోజులు సమ్మర్​ ఆఫ్​ 69 తప్ప ఇంకేమి ఉండదనిపిస్తుంది"

-సచిన్ తెందుల్కర్, భారత మాజీ బ్యాట్స్​మన్.

ఈ నాలుగో టెస్టు మ్యాచ్​లో విధ్వంసకర బ్యాటింగ్​ చేసిన సచిన్.. ముందు మూడు మ్యాచ్​ల్లో ఘోరంగా విఫలమయ్యాడు. 5 ఇన్నింగ్స్​లు ఆడి రెండు సార్లు డకౌట్​ అయ్యాడు. మొత్తంగా కేవలం 88 పరుగులే చేశాడు. తర్వాత మళ్లీ ఫామ్​లోకి వచ్చిన తెందుల్కర్ 241 పరుగులు చేసిన సిరీస్​ను సమం చేయడంలో కీలకపాత్ర పోషించాడు.

2003లో ఆ పాట..

2003 ప్రపంచకప్ సందర్భాన్ని గుర్తు చేసుకున్న సచిన్.. లక్కీ అలీ 'సర్​' ఆల్బమ్​ పలుమార్లు విన్నట్లు పేర్కొన్నాడు. ఈ టోర్నీలో సచిన్​ 673 పరుగులు చేసి అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్​మన్​గా నిలిచాడు.

ఇదీ చదవండి:'విరుష్క' వివాహ బంధానికి మూడేళ్లు.. జంట భావోద్వేగం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.