అఫ్గాన్‌తో మ్యాచ్‌లో ధోని నిదానంగా ఆడటాన్ని తప్పుపట్టిన సచిన్ బంగ్లాతో మ్యాచ్‌లో మహీ ప్రదర్శనను సమర్థించాడు. జట్టుకు ఏది సరైనదో ధోని అదే చేశాడని తెలిపాడు. ఈ మ్యాచ్‌లో 33 బంతుల్లో 35 పరుగులు చేశాడు.
"బంగ్లాతో ధోని కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. జట్టుకు ఏది సరైనదో అదే చేశాడు. అతడు 50వ ఓవర్ వరకు ఉండి ఉంటే మిగతా వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపేవాడే. మహీ కూడా అదే అనుకుని ఉంటాడు" - సచిన్ తెందూల్కర్
అయితే ధోని ప్రదర్శనపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వస్తున్న నేపథ్యంలో సచిన్ ఇలా స్పందించడం విశేషం. మంగళవారం బంగ్లాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 28 పరుగుల తేడాతో గెలిచి సెమీస్‌కు అర్హత సాధించింది. చివరి పది ఓవర్లలో టీమిండియా 63 పరుగులు చేసింది.
ఇది చదవండి: అతి త్వరలో క్రికెట్‌కు ధోని గుడ్ బై!