ETV Bharat / sports

ఆ యువకుడి ప్రతిభకు సచిన్​ ఫిదా - ఐమాన్ కోలి

రూబిక్​ క్యూబ్​ను చూసుకుంటూ కలపడమే గొప్ప. అలాంటిది చూడకుండా సెకండ్ల వ్యవధిలో చేశాడో యువకుడు. అది కూడా భారత క్రికెట్ దిగ్గజం సచిన్ సమక్షంలో. ఇదంతా వీడియో తీసిన లిటిల్​ మాస్టర్​.. తన ఇన్​స్టా ఖాతాలో పోస్ట్​ చేశాడు.

sachin posts a video in his instagram
యువకుడి ప్రతిభకు సచిన్​ ఫిదా- వీడియో వైరల్​
author img

By

Published : Feb 28, 2021, 9:09 PM IST

రంగు రంగుల గళ్లు.. ఆరు ముఖాలున్న ఓ చిన్న చతురస్రం.. చేతిలో పట్టుకుని ఎంత తిప్పినా ఒక వైపు మాత్రమే ఒక రంగులోకి మారుతుంది. మిగిలిన ముఖాలు ఓ మానాన ఒక్కరంగులోకి మారవు. మరి, ఆ రూబిక్ క్యూబ్ పజిల్​ను కళ్లతో చూస్తూ చేయడమే గొప్ప. అలాంటిది.. చూడకుండా కేవలం 17 సెకండ్లలోనే టాస్క్​ను చేశాడు మహమ్మద్​ ఐమాన్​ కోలి అనే యువకుడు.

కోలి ఈ టాస్క్​ను పూర్తి చేసింది టీమ్​ఇండియా క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్​ సమక్షంలో. అతని ప్రతిభకు ఆశ్చర్యపోయిన లిటిల్ మాస్టర్..​ తనకు నేర్పించాలని కోరాడు. కోలి భారత గిన్నిస్​ బుక్​ రికార్డు విజేత అని తెందుల్కర్ పేర్కొన్నాడు. ఈ వీడియోను తన ఇన్​స్టాలో పోస్ట్​ చేశాడు మాస్టర్​ బ్లాస్టర్​. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరలవుతోంది.

ఇదీ చదవండి: శ్రీలంక క్రికెట్ బోర్డు డైరెక్టర్​గా టామ్​ మూడీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.