టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్లు సచిన్ తెందూల్కర్, యువరాజ్ సింగ్ మధ్య కీపిటప్ ఛాలెంజ్ ఇంకా కొనసాగుతోంది. ఇటీవల లాక్‌డౌన్ వేళ యువీ.. 'స్టే హోమ్, స్టే సేఫ్' పేరిట కొత్త ఛాలెంజ్‌ను ప్రారంభించాడు. అప్పుడు బ్యాట్ ఎడ్జ్‌పై బంతిని ఆడిస్తూ అతడు వీడియో రూపొందించి సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు. దాన్ని తన సహచరులైన సచిన్, హర్భజన్, రోహిత్‌శర్మలకు నామినేట్ చేశాడు. దాంతో ఆ ముగ్గురూ యువీ ఛాలెంజ్‌ను స్వీకరించారు. అయితే.. రోహిత్, భజ్జీ ఆ ఛాలెంజ్‌ను ఇతరులకు నామినేట్ చేయగా, సచిన్ మాత్రం వినూత్నంగా ఆలోచించాడు. కళ్లకు గంతలు కట్టుకొని యువీ చేసిన ఛాలెంజ్‌ను స్వీకరించి దాన్నే తిరిగి అతడికే నామినేట్ చేశాడు.
ఈ నేపథ్యంలో యువీ ఇంకాస్త భిన్నంగా ఆలోచించి ఆదివారం మరో కొత్త ఛాలెంజ్‌తో సచిన్ ముందుకొచ్చాడు. కళ్లకు గంతలు కట్టుకుని వంటింట్లో చపాతి చేసే కర్రపై (రోలింగ్‌పిన్) టెన్నిస్ బంతిని 100సార్లు ఆడించాడు. అదే ఛాలెంజ్‌ను మాస్టర్ బ్లాస్టర్‌కు విసురుతూ ఇలా అన్నాడు.."మాస్టర్ నువ్వు మైదానంలో ఎన్నో రికార్డులు బ్రేక్ చేశావ్. ఇప్పుడు కిచెన్‌లో నా 100 రికార్డును బ్రేక్ చేయాల్సిన సమయం వచ్చింది. అయితే, వంటింట్లో ఏదీ పగలగొట్టవని ఆశిస్తున్నా" అంటూ యువీ ఇన్‌స్టాలో ఆదివారం పోస్టు చేశాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ఈ వీడియోపై లిటిల్‌మాస్టర్ తనదైన శైలిలో ప్రతి స్పందించాడు. "యువీ పరోటా చేస్తావా?" అంటూ ఇన్‌స్టాలోనే ఓ వీడియో పోస్టు చేశాడు. అందులో "నేను విసిరిన ఛాలెంజ్‌ను నువ్వు రోలింగ్‌పిన్‌తో కిచెన్‌లో బాగా చేశావు. అదే రోలింగ్‌పిన్‌తో నాకు పరోటాలు చేసిపెట్టు. నేను ప్లేట్‌తో పాటు పచ్చడి, పెరుగుతో సిద్ధంగా ఉన్నా" అని కొత్త ఛాలెంజ్ విసిరాడు.