ప్రస్తుతం జరుగుతున్న కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)లో జమైకా తల్వాస్కు సారథ్యం వహిస్తున్న క్రికెటర్ ఆండ్రీ రసెల్ తీవ్రంగా గాయపడ్డాడు. సెయింట్ లూసియా జౌక్స్తో గురువారం జరిగిన మ్యాచ్లో... విల్జోన్ వేసిన బంతిని హిట్ చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యడు. ఆ బంతి రసెల్ హెల్మెట్ వెనుక భాగంలో బలంగా తాకింది. అతడి కుడి చెవికి గాయమవగా, నొప్పి తట్టుకోలేక మైదానంలోనే కుప్పకూలిపోయాడు. వెంటనే ప్రాథమిక చికిత్స అందించిన వైద్యబృందం.. ఆస్పత్రికి తరలించారు.
-
#AndreRussell Suffers Brutal Blow During #Jamaica Tallawahs vs #StLuciaZouks Match #CPL19 pic.twitter.com/UorR4K7BUb
— Neetu Kamal (@imneetukamal) September 13, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">#AndreRussell Suffers Brutal Blow During #Jamaica Tallawahs vs #StLuciaZouks Match #CPL19 pic.twitter.com/UorR4K7BUb
— Neetu Kamal (@imneetukamal) September 13, 2019#AndreRussell Suffers Brutal Blow During #Jamaica Tallawahs vs #StLuciaZouks Match #CPL19 pic.twitter.com/UorR4K7BUb
— Neetu Kamal (@imneetukamal) September 13, 2019
ఈ మ్యాచ్లో సెయింట్ లూసియా ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్కు దిగిన జమైకా తల్వాస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసింది. లక్ష్యాన్ని 16.4 ఓవర్లలోనే ఛేదించింది లూసియా. 30 బంతుల్లో 75 పరుగులతో చేసి ఆకట్టుకున్న భారీకాయుడు కార్న్వాల్(లూసియా).. 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు అందుకున్నాడు.
ఇదీ చదవండి...