ETV Bharat / sports

జెఫ్రీ బాయ్​కాట్​ను అధిగమించిన రూట్​

author img

By

Published : Jan 24, 2021, 9:05 AM IST

Updated : Jan 24, 2021, 10:40 AM IST

శ్రీలంకతో జరుగుతోన్న రెండో టెస్టులో రికార్డు సాధించాడు ఇంగ్లాండ్​ కెప్టెన్ జో రూట్. టెస్టు క్రికెట్​లో మాజీ ఓపెనర్​ జెఫ్రీ బాయ్​కాట్ రికార్డును అధిగమించి తమ జట్టు తరఫున అత్యధిక పరుగులు సాధించిన ఆరో క్రికెటర్​గా ఘనత సాధించాడు.

joe root
జో రూట్​

ఇంగ్లాండ్​ టెస్టు సారథి జో రూట్​ మరో ఘనత సాధించాడు. ఇటీవల టెస్టు​ల్లో తమ​ జట్టు తరఫున 8వేల పరుగులు చేసిన ఏడో బ్యాట్స్​మన్​గా నిలిచిన ఇతడు.. తాజాగా ఆ రికార్డులో అడుగు ముందుకు జరిగి మరో మైలురాయిని చేరుకున్నాడు. తమ జట్టు మాజీ ఓపెనర్​ జెఫ్రీ బాయ్​కాట్​ను వెనక్కి నెట్టి టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన ఇంగ్లాండ్​ ఆరో క్రికెటర్​గా నిలిచాడు.

శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో ఈ ఫీట్​ను అందుకున్నాడు రూట్​. రూట్​ ప్రస్తుతం టెస్టు క్రికెట్​లో 8119 పరుగులు చేశాడు.

శ్రీలంకతో మ్యాచ్​ తొలి ఇన్నింగ్స్​లో ఆతిథ్య జట్టు 381 పరుగులు చేసింది. రెండో రోజు ఆట ముగిసేసరికి ఇంగ్లాండ్ 98/2 పరుగులు చేసి..​ 283 పరుగుల వెనుకంజలో ఉంది. 67 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు రూట్​. అతడికి టెస్టులో ఇది 50వ అర్ధశతకం. ఇప్పటివరకు 18 శతకాలు చేశాడు.

ఇంగ్లాండ్​ తరఫున టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో అగ్రస్థానంలో ఇంగ్లాండ్​ మాజీ సారథి అలిస్టర్​ కుక్​(12,477) ఉండగా.. గ్రాహం​ గూచ్​(8,900), అలెక్​ స్టీవార్ట్​(8,463), డేవిడ్​ గోవర్​(8,231), కెవిన్​ పీటర్సన్​(8,181) ఇలా వరుసగా తొలి ఐదు స్థానాల్లో ఉన్నారు.

ఇదీ చూడండి: రూట్​ రికార్డు.. ఇంగ్లాండ్​ ఏడో బ్యాట్స్​మన్​గా

Last Updated : Jan 24, 2021, 10:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.