ఇంగ్లాండ్ సారథి జో రూట్ జోరు మాములుగా లేదు. ఇటీవల శ్రీలంకతో జరిగిన సిరీస్‌లో డబుల్ సెంచరీ, సెంచరీ సాధించిన అతడు.. ప్రస్తుతం టీమ్ఇండియాతో జరుగుతోన్న తొలి టెస్టు తొలి రోజు ఆటలో మరో శతకం బాది రికార్డులకెక్కాడు. 100వ టెస్టులో శతకం బాదిన తొమ్మిదో క్రికెటర్‌గా ఘనత సాధించాడు. సుదీర్ఘ ఫార్మాట్లో ఇది అతడికి 20వ శతకం.
-
Congratulations, @root66! 👏
— England Cricket (@englandcricket) February 5, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
What's been your favourite moment from his Test career so far?#R100T pic.twitter.com/CUt7l4nGgA
">Congratulations, @root66! 👏
— England Cricket (@englandcricket) February 5, 2021
What's been your favourite moment from his Test career so far?#R100T pic.twitter.com/CUt7l4nGgACongratulations, @root66! 👏
— England Cricket (@englandcricket) February 5, 2021
What's been your favourite moment from his Test career so far?#R100T pic.twitter.com/CUt7l4nGgA
అతడి కన్నా ముందు కొలిన్ కౌడ్రె( 1968లో ఆస్ట్రేలియాపై 104), జావేద్ మియాందాద్(1969లో భారత్‌పై 145), గోర్డన్ గ్రీనిడ్జ్(1990లో ఇంగ్లాండ్‌పై 149), అలె స్టీవార్ట్(2000లో వెస్డిండీస్‌పై 105), ఇంజమామ్ ఉల్ హక్( 2004లో భారత్‌పై184) , రికీ పాంటింగ్(2006లో దక్షిణాఫ్రికాపై 120, రెండో ఇన్నింగ్స్‌లో 143), గ్రేమ్ స్మిత్(2012లో ఇంగ్లాండ్‌పై 131), హషీమ్ ఆమ్లా(2017లో శ్రీలంకపై 134) ఈ ఘనతను సాధించారు.
తొలి, వందో టెస్టులో ఒకే జట్టుపై సెంచరీ చేసిన మూడో క్రికెటర్‌గానూ నిలిచాడు. అంతకముందు భారత్‌పై వెస్డిండీస్ మాజీ క్రికెటర్ కార్ల్ హూపర్, పాకిస్థాన్‌పై టీమ్ఇండియా మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ తమ తొలి, వందో టెస్టులో శతకాలు బాదారు.
ఈ మ్యాచు తొలి రోజు ఆట ముగిసేసరికి మూడు వికెట్లు కోల్పోయి 263 పరుగులు చేసింది ఇంగ్లాండ్. జో రూట్(128*) సెంచరీ, డొమినిక్ సిబ్లే (87) అర్ధ సెంచరీలతో మెరిశారు. భారత బౌలర్లలో బుమ్రా 2 , అశ్విన్ ఓ వికెట్ దక్కించుకున్నారు.