టీమిండియా క్రికెటర్ రోహిత్ శర్మ మరో అరుదైన రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. భారత్ తరఫున ఒక టెస్టు మ్యాచ్‌లో అత్యధిక సిక్సులు (9) కొట్టిన ఆటగాడిగా ఘనత సాధించాడు. విశాఖపట్నం వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఈ రికార్డు సృష్టించాడు.
ఇంతకుముందు నవజ్యోత్ సింగ్ సిద్ధు (8) పేరిట ఈ రికార్డు ఉండేది. మాథ్యూ హెడెన్ (ఆస్ట్రేలియా), వీరేంద్ర సెహ్వాగ్ (భారత్), హర్భజన్ సింగ్ (భారత్), అజింక్య రహానే (భారత్) ఏడు సిక్సులతో తర్వాతి స్థానంలో ఉన్నారు.
తొలిసారి టెస్టుల్లో ఓపెనర్‌గా వచ్చిన రోహిత్.. తొలి ఇన్నింగ్స్‌లో 176 పరుగులతో సత్తాచాటాడు. రెండో ఇన్నింగ్స్‌లోనూ ఇప్పటికే అర్ధశతకం పూర్తి చేసి ఆకట్టుకుంటున్నాడు.
ఇప్పటికే వన్డే (16), టీ20 (10) మ్యాచ్‌ల్లోను భారత్ తరఫున అత్యధిక సిక్సులు బాదిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు రోహిత్.
ఇవీ చూడండి.. క్రికెటర్ పాండ్యకు శస్త్ర చికిత్స విజయవంతం