'క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బంగాల్' స్థాపించి 90 సంవత్సరాలు గడిచిన సందర్భంగా ఆదివారం రక్తదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. దాతలకు టీమిండియా ఆటగాడు రోహిత్‌శర్మ పేరుతో ప్రశంసపత్రాలను అందచేసింది బంగాల్ క్రికెట్సంఘం. గతంలో రాహుల్ ద్రవిడ్, యువరాజ్‌సింగ్, వీవీఎస్ లక్ష్మణ్ సంతకం చేసిన ప్రశంసాపత్రాలను అందజేశారు.స్థాపన దినాన్ని పురస్కరించుకొని బంగాల్ క్రికెట్ బోర్డు ప్రెసిడెంట్, ఛైర్మన్ బోర్డు ట్రస్టీస్ జట్ల మధ్య ప్రదర్శన మ్యాచ్ జరిగింది. సర్ ఫ్రాంక్ వొరెల్ జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ఈ రక్తదాన శిబిరాన్ని వరుసగా 40 వ సంవత్సరం నిర్వహిస్తున్నారు.ఇందులో పాల్గొన్న దాతలకు బ్యాడ్జ్‌లు మరియు స్వాష్‌బక్లింగ్ బ్యాట్స్ మాన్ సంతకం చేసిన గౌరవ ధ్రువీకరణ పత్రాలు అందజేస్తారు.
1981 నుంచి ఫిబ్రవరి 3 న బంగాల్ క్రికెట్ సంఘం వ్యవస్థాపక దినోత్సవాన్ని ఆచరిస్తూ.. 1962 లో బార్బడోస్ టెస్ట్‌లో జరిగిన సంఘటనను గుర్తుచేసుకుంటూ వొరెల్కు అంకితం చేసిన రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. భారత కెప్టెన్ నారి కాంట్రాక్టర్, చార్లీ గ్రిఫిత్ వేసిన బౌన్సర్ తాకి గాయపడ్డాడు. ఆ సమయంలో రక్తం ఇవ్వడానికి ముందుకు వచ్చిన వొరెల్ ప్రేరణతో, తీవ్రంగా గాయపడిన కాంట్రాక్టర్ కోసం భారత్, వెస్టిండీస్ క్రికెటర్లూ రక్తదానం చేశారు.
ఇది చూడండి... కోహ్లీ-రోహిత్‌తో దోబూచులాడుతున్న రికార్డు