ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ రికీ పాంటింగ్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నాడు టీమ్ఇండియా వైస్‌కెప్టెన్ రోహిత్‌శర్మ. సోమవారం భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌తో కలిసి ఇన్స్టాగ్రామ్ లైవ్ సెషన్లో పాల్గొన్న రోహిత్ పలు విషయాలను పంచుకున్నాడు. వారిద్దరు క్రికెట్‌తో పాటు పలు విషయాలపై చర్చించుకున్నారు.
"2013లో జరిగిన ఐపీఎల్ వేలంలో రికీ పాంటింగ్‌ను ముంబయి ఇండియన్స్ దక్కించుకుంది. 2012లోనే సచిన్ కెప్టెన్‌గా తప్పుకుంటున్నట్లు చెప్పాడు. అప్పుడు హర్భజన్ సింగ్‌ను సారథిగా చేశారు. కానీ, 2013లో భజ్జీని ఎందుకు కెప్టెన్ చేయలేదో నాకు అర్థం కాలేదు. అప్పుడు జట్టుకు నేను నాయకత్వం వహించాలేమో అనుకున్నా. అంతలోనే వేలంలో పాంటింగ్‌ను తీసుకున్నారు. జట్టులోకి వచ్చిన తర్వాత కెప్టెన్‌గా ప్రతి ఒక్క ఆటగాడి గురించి తెలుసుకొని.. కొద్ది రోజుల్లోనే అందరికి దగ్గరయ్యారు పాంటింగ్. నిజం చెప్పాలంటే ఆయన యువ క్రికెటర్లకు బాగా ప్రోత్సహించేవారు".
- రోహిత్ శర్మ, టీమ్ఇండియా వైస్ కెప్టెన్
కానీ ఆ సీజన్లో పాంటింగ్ వరుస మ్యాచ్‌ల్లో విఫలమయ్యాడు. ఫలితంగా తన కెప్టెన్సీని పాంటింగ్.. రోహిత్ శర్మకు అప్పగించాడు. 2013 ఐపీఎల్లో ముంబయికు ఆటగాడిగానే కాక కోచ్ గానూ వ్యవహరించాడు పాంటింగ్.
ఇదీ చూడండి.. భార్యా, బ్యాటింగ్ పార్ట్నర్ ఎవర్ని నమ్ముతారు!