కరోనా ప్రభావంతో సాధారణ ప్రజల నుంచి ప్రముఖుల వరకు అందరూ ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఇప్పటికే టోర్నీలు, షూటింగ్‌లు అన్ని బంద్ అయిపోయాయి. ఐపీఎల్ వచ్చే నెల 15కు వాయిదా పడింది. ఈ క్రమంలో ఇంట్లోనే ఉన్న టీమిండియా క్రికెటర్ రోహిత్ శర్మ.. కూతురు సమైరాతో క్రికెట్ ఆడుకుంటున్నాడు. ఆ వీడియోను ఇన్‌స్టా పోస్ట్ చేశాడు.
సమైరా కోసం ప్రత్యేకంగా కొన్న బ్యాట్‌తో, ఆ చిన్నారికి బ్యాటింగ్ నేర్పిస్తున్నాడు రోహిత్. క్రికెట్ బంతి బదులుగా ఫుట్‌బాల్‌ను ఇందుకోసం ఉపయోగించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
న్యూజిలాండ్ పర్యటన మధ్యలో తొడ కండరాల గాయంతో స్వదేశానికి వచ్చిన రోహిత్.. ఇటీవలే పూర్తి ఫిట్నెస్ సాధించాడు. ఐపీఎల్‌తో మళ్లీ ఫామ్ నిరూపించుకోవాలని భావించాడు. కానీ కరోనా ప్రభావంతో టోర్నీ వాయిదా పడింది.
ఇప్పటికే దేశంలోని చాలా రాష్ట్రాలు మార్చి 31 వరకు లాక్డౌన్ ప్రకటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ తర్వాతైనా ఐపీఎల్ జరుగుతుందా? లేదా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.