ETV Bharat / sports

ఇంగ్లాండ్​తో వన్డే సిరీస్​కు రోహిత్​ దూరం! - రోహిత్ శర్మ

నిరుడు ఐపీఎల్​ నుంచి బయో బబుల్​లో ఉంటున్న ఆటగాళ్లకు విశ్రాంతినివ్వాలని యోచిస్తోంది బీసీసీఐ. ఇంగ్లాండ్​తో పరిమిత ఓవర్ల సిరీస్​లకు ఇప్పటికే బుమ్రా, సిరాజ్​లను విడుదల చేసింది బోర్డు. ఇక వన్డే సిరీస్​కు రోహిత్​తో పాటు పంత్​, సుందర్​లకు విశ్రాంతినివ్వనున్నట్లు సమాచారం.

Rohit Sharma out of ODI series against England
ఇంగ్లాండ్​తో వన్డే సిరీస్​కు రోహిత్​ దూరం!
author img

By

Published : Mar 2, 2021, 7:06 AM IST

ఐపీఎల్​ 2021కు ఇంకా ఎంతో సమయం లేదు. ఇంకా తేదీలు ప్రకటించలేదు కానీ.. ఏప్రిల్​ రెండో వారంలో టోర్నమెంట్ ఆరంభమయ్యే అవకాశముంది. భారత్​లోనే జరుగుతుందని భావిస్తున్న ఐపీఎల్​కు ముందు టీమ్ఇండియా ఆటగాళ్లందరూ తాజాగా ఉండాలని బీసీసీఐ కోరుకుంటోంది. ఈ క్రమంలోనే 2020 ఐపీఎల్​ (సెప్టెంబర్​ 19) నుంచి బయో బబుల్​లో​ ఉంటున్న 10 మంది ఆటగాళ్లలో సాధ్యమైనంత ఎక్కువమందికి విశ్రాంతి ఇవ్వాలని చూస్తోంది.

ఇంగ్లాండ్​తో టీ20 సిరీస్​కు ఇటీవలే జట్టును ప్రకటించారు. బుమ్రాతో పాటు సిరాజ్​కు ఆ సిరీస్​ నుంచి విశ్రాంతి కల్పించారు. వ్యక్తిగత కారణాలతో బుమ్రా విజ్ఞప్తి చేయడం వల్ల చివరి టెస్టు కంటే ముందు నుంచే అతణ్ని బోర్డు జట్టు నుంచి విడుదల చేసింది. అసలు టీ20 సిరీస్​ ఆరంభానికి ముందే బీసీసీఐ.. కావాలంటే విశ్రాంతి తీసుకునే అవకాశం ఆటగాళ్లకు ఇచ్చింది. బయో బబుల్​లో ఎక్కువ కాలం ఉండడం వల్ల వచ్చే మానసిక ఇబ్బందుల గురించి అవగాహన కూడా కల్పించింది.

ఆటగాళ్లపై భారం పడకుండా ఉండేందుకు బోర్డు ఇప్పటికే బుమ్రా, సిరాజ్​లకు ఇంగ్లాండ్​తో టీ20ల నుంచి విశ్రాంతినిచ్చింది. ఇక ఇంగ్లాండ్​తో జరిగే వన్డే సిరీస్​కు రోహిత్​ శర్మతో పాటు సుందర్​, పంత్​లను దూరం పెట్టనున్నట్లు సమాచారం. మార్చి 23, 26, 28వ తేదీల్లో వన్డే మ్యాచ్​లు జరగనున్నాయి. అంతకంటే ముందు 12, 14, 16, 18, 20 తేదీల్లో ఇరు జట్లూ టీ20 మ్యాచ్​లు ఆడతాయి.

ఇదీ చదవండి: వేదికలపై ఫ్రాంచైజీల నిరసన గళం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.