ETV Bharat / sports

'నా కంటే తన బౌలింగ్ బాగుంది.. పెద్ద ఫ్యాన్ అయిపోయా'

పేసర్ బుమ్రాను అనుకరించి చూపించింది రోహిత్ శర్మ కుమార్తె సమైరా. ఆ వీడియోను సదరు బౌలర్ ట్విట్టర్​లో పంచుకున్నాడు. తన కంటే బాగా బౌలింగ్ చేసిందని మెచ్చుకున్నాడు.

బుమ్రాను అనుకరించి రోహిత్ శర్మ కుమార్తె
బుమ్రా సమైరా
author img

By

Published : Apr 3, 2020, 5:34 PM IST

టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అతడి బౌలింగ్ యాక్షన్, పేస్​, యార్కర్లకు ఫిదా అవుతుంటారు. అయితే ఓపెనర్ రోహిత్ శర్మ కుమార్తె సమైరా.. బుమ్రాకు అభిమానిగా మారినట్లుంది. ఈ పేసర్ ట్విట్టర్​లో పోస్ట్ చేసిన వీడియో చూస్తే ఈ విషయం తెలుస్తోంది.

ఈ వీడియోలో రోహిత్.. కూతురు సమైరాతో ఆడుకుంటూ ఉంటాడు. పక్కన ఉన్న అతడి భార్య రితిక.. బుమ్రా బౌలింగ్ ఎలా చేస్తాడని ఆ చిన్నారిని అడుగుతుంది. అప్పుడు సమైరా జస్ప్రీత్​ను అనుకరించి చూపిస్తుంది. దీంతో హిట్​మ్యాన్ నవ్వుతాడు.

అయితే వీడియోతో పాటే ఓ ఆసక్తికర వ్యాఖ్యను జోడించాడు బుమ్రా. తన కంటే సమైరానే బాగా బౌలింగ్ చేసిందని, ఆ చిన్నారి తనను అభిమానించే కంటే తానే ఎక్కువగా ఆమెకు ఫ్యాన్ అయ్యానని రాసుకొచ్చాడు.

ప్రస్తుతం క్రికెటర్లందరూ లాక్​డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితమయ్యారు. కరోనా కారణంగా ఐపీఎల్ ఇప్పటికే ఏప్రిల్ 15కు వాయిదా పడింది. అయితే ఈ లీగ్​ జరుగుతుందా? లేదా? అనేది త్వరలో స్పష్టత రానుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.