టీమిండియా హిట్‌మ్యాన్ రోహిత్‌శర్మ.. వన్డేల్లో అరుదైన ఘనత సాధించాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగి అత్యంత వేగంగా ఏడువేల పరుగులు పూర్తి చేసిన క్రికెటర్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో రోహిత్(42; 44 బంతుల్లో 6x4) అర్ధ శతకం చేజార్చుకున్నాడు. తద్వారా 137 ఇన్నింగ్స్‌ల్లో ఓపెనర్‌గా ఈ మైలురాయిని చేరుకున్నాడు. అతడి కంటే ముందు ఈ జాబితాలో హషీమ్ ఆమ్లా(147), సచిన్ తెందూల్కర్(160), తిలకరత్నే దిల్షాన్(165), సౌరభ్ గంగూలీ(168) ఉన్నారు.
గతేడాది ప్రపంచకప్‌లో ఐదు శతకాలతో చెలరేగిన రోహిత్.. 2019కి గానూ వన్డే ‘క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’గా నిలిచాడు. గతేడాది మొత్తంగా 28 మ్యాచ్‌లాడిన రోహిత్ 57.30 సగటుతో 1409 పరుగులు చేశాడు. టీమిండియా వరుస విజయాలతో చెలరేగింది.
మంగళవారం ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో భారత్.. 10 వికెట్ల తేడాతో ఘోర పరాభవం చెందింది.
ఇదీ చదవండి: ధావన్, కోహ్లీ, రాహుల్ విధ్వంసం.. ఆసీస్ లక్ష్యం 341