ఐసీసీ టెస్టు ర్యాకింగ్స్లో రోహిత్ శర్మ దూసుకెళ్లాడు. ఓపెనర్‌గా అరంగేట్ర టెస్టులోనే రెండు శతకాలు బాది రికార్డు సృష్టించిన హిట్ మ్యాన్ 17వ స్థానానికి ఎగబాకాడు. టెస్టు కెరీర్లో అతడికిదే అత్యుత్తమం.
సఫారీలపై ద్విశతకం బాదిన మరో భారత ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 38 స్థానాలు ఎగబాకి 25వ స్థానంలో నిలిచాడు.టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ 899 పాయింట్లతో రెండో ర్యాంక్‌లోనే కొనసాగుతున్నాడు. విశాఖ టెస్టులో 20, 31* పరుగులు మాత్రమే చేసి అభిమానులను నిరాశ పరిచాడు కోహ్లీ.
2018 జనవరి తర్వాత కోహ్లీ 900 రేటింగ్ పాయింట్ల కంటే తక్కువగా సాధించడం ఇదే తొలిసారి. సఫారీ బ్యాట్స్‌మెన్‌లో శతకాలు బాదిన డికాక్ 7వ స్థానంలో, ఎల్గర్ 14వ స్థానంలో కొనసాగుతున్నారు.
విశాఖ టెస్టులో ఎనిమిది వికెట్లతో సత్తాచాటిన రవిచంద్రన్ అశ్విన్ బౌలర్ల విభాగంలో టాప్-10లో చోటు దక్కించుకున్నాడు. నాలుగు స్థానాలు ఎగబాకి 10వ స్థానంలో కొనసాగుతున్నాడు. షమీ 14వ ర్యాంకుకు మెరుగయ్యాడు. ఆల్‌రౌండర్స్ విభాగంలో జడేజా రెండో స్థానంలో ఉండగా.. అశ్విన్ 5వ ర్యాంకును దక్కించుకున్నాడు.
ఇదీ చదవండి: సానియా సోదరితో అజారుద్దీన్ తనయుడి పెళ్లి