ఆస్ట్రేలియాతో జరిగిన ఐదో వన్డేలో రోహిత్ శర్మ మరో రికార్డు సాధించాడు. వన్డే కెరీర్లో 8వేల పరుగులు పూర్తి చేసిన తొమ్మిదో భారత బ్యాట్స్‌మెన్‌గా రికార్డుకెక్కాడు. సౌరవ్ 200 ఇన్నింగ్స్‌లో ఈ ఘనత అందుకోగా రోహిత్ శర్మ(8010) కూడా 200 ఇన్నింగ్స్‌ల్లోనే 8వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. .
విరాట్ కోహ్లి 172 ఇన్నింగ్స్‌ల్లో 8వేలు పరుగులు సాధించి అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 8వేల పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా ఉన్నాడు. డివిల్లియర్స్ 182 ఇన్నింగ్స్‌లతో రెండోస్థానంలో ఉన్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఈ ఘనత సాధించిన వారిలో 31వ ఆటగాడు రోహిత్.
వన్డేల్లో 8 వేల పరుగులు పూర్తి చేయడానికి రోహిత్‌కు 46 పరుగులు అవసరం కాగా... ఆస్ట్రేలియాతో జరిగిన ఐదో వన్డేలో 56 పరుగులు చేశాడు. సచిన్ తెందుల్కర్, విరాట్ కోహ్లి, సెహ్వాగ్, ధోని, అజారుద్దీన్, గంగూలీ, యువరాజ్ సింగ్, రాహుల్ ద్రవిడ్... రోహిత్ శర్మ కంటే ముందు ఈ ఘనత సాధించారు.
ఆసీస్‌తో జరిగిన ఐదో వన్డేలో భారత్ 35 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.