ETV Bharat / sports

'టీ20ల్లో ‌రోహిత్​కు జోడీగా శిఖర్​ ధావనే​ బెస్ట్​'

పొట్టి ప్రపంచకప్​కు సమయం దగ్గర పడుతోంది. ఈ తరుణంలో అందరి దృష్టి జట్టు కూర్పుపైనే ఉంది. తాజాగా ఇంగ్లాండ్​తో జరిగిన టీ20 సిరీస్​తో ఓ అంచనాకు వచ్చినప్పటికీ.. కొన్ని స్థానాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మాజీ సెలెక్టర్​ శరన్​దీప్​ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Rohit-Dhawan best option for T20 WC, former selector Sarandeep
'‌రోహిత్​-ధావన్​ జంటనే అత్యుత్తమ ఓపెనింగ్ జోడీ'
author img

By

Published : Mar 30, 2021, 7:20 PM IST

Updated : Mar 30, 2021, 8:34 PM IST

టీమ్‌ఇండియాలో రోహిత్‌ శర్మ-శిఖర్‌ ధావన్‌ అత్యుత్తమ ఓపెనింగ్‌ జోడీ అని.. రాబోయే టీ20 ప్రపంచకప్‌లో వాళ్లిద్దరే బరిలోకి దిగాలని.. మాజీ క్రికెటర్‌, సెలెక్టర్‌ శరన్‌దీప్‌ అభిప్రాయపడ్డారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్యూలో టీమ్‌ఇండియా ఆటగాళ్లపై ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో ధావన్‌ తొలి మ్యాచ్‌లో విఫలమయ్యాడు. దీంతో జట్టు యాజమాన్యం తర్వాత ఇషాన్‌ కిషన్‌కు ఓపెనర్‌గా అవకాశమిచ్చింది. వచ్చిన అవకాశాన్ని అతడు చక్కగా వినియోగించుకుని.. అందరిచేత ప్రశంసలు పొందాడు. మరోవైపు చివరి టీ20లో రోహిత్‌తో కలిసి ఓపెనింగ్‌ చేసిన కోహ్లీ దుమ్మురేపాడు. మ్యాచ్‌ అనంతరం మాట్లాడుతూ భవిష్యత్‌లోనూ తాను ఓపెనింగ్‌ చేయాలనే ఆలోచనతో ఉన్నట్లు చెప్పాడు. ఈ నేపథ్యంలోనే శరన్‌దీప్‌ పలు విషయాలపై స్పందించాడు.

లెఫ్ట్​ అండ్​ రైట్​ జోడీనే బెటర్​..

"తొలి టీ20 తర్వాత ధావన్‌ను తొలగించడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఐపీఎల్‌, ఆస్ట్రేలియా పర్యటనల్లో బాగా ఆడాడు. మానసికంగా అతడెంతో దృఢంగా ఉంటాడు. ఎప్పుడు ఆడినా పరుగులు చేస్తాడు. అయితే, తొలి టీ20 తర్వాత టీమ్ఇండియా అతడిని పక్కన పెట్టి ఇతరులకు అవకాశం ఇవ్వాలని చూసిందేమో! కానీ, నా అభిప్రాయం ప్రకారం.. రోహిత్‌-ధావన్‌ల రైట్‌ అండ్‌ లెఫ్ట్‌ కాంబినేషనే అత్యుత్తమ జోడీ. టీ20 ప్రపంచకప్‌లో వాళ్లిద్దరే ఓపెనింగ్‌ చేయాలి. ఒక్క మ్యాచ్‌లో ఆడనంత మాత్రాన ధావన్‌ను అలా తొలగించడం సరికాదు. పొట్టి సిరీస్‌ తర్వాత వన్డేల్లో అతడు మంచి ప్రదర్శనే చేశాడు. కొద్ది రోజుల్లో ప్రారంభమయ్యే ఐపీఎల్‌ టోర్నీయే టీమ్‌ఇండియా ప్రపంచకప్‌ జట్టును నిర్ణయిస్తుంది. అందులో చోటు దక్కాలంటే ఇషాన్‌ కిషన్‌ కూడా అత్యద్భుత ప్రదర్శన చేయాల్సి ఉంటుంది" అని శరన్‌ పేర్కొన్నారు.

పంత్​ స్థానానికి ఢోకా లేదు..

అనంతరం రిషభ్‌పంత్‌ గురించి మాట్లాడిన మాజీ సెలెక్టర్‌.. యువ బ్యాట్స్‌మన్‌, వికెట్‌ కీపర్‌ను ఎంత పొగిడినా తక్కువే అని చెప్పారు. గతంలో పంత్‌ ఫిట్‌నెస్‌, షాట్ల ఎంపికలో ఇబ్బంది పడ్డాడని.. వాటి మీద దృష్టిసారించి మెరుగయ్యాడని తెలిపారు. అనుభవంతోనే ఏ క్రికెటర్‌ అయినా చెలరేగుతాడన్నారు. హార్దిక్‌ పాండ్య ఇప్పుడు అనుభవంతో ఆడుతున్నట్లే పంత్‌ కూడా గత ఆరు నెలలుగా ఆడుతున్నాడన్నారు. టెస్టు క్రికెట్‌లో ఇంకో పదేళ్లు తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడని శరన్‌దీప్‌ అభిప్రాయపడ్డారు.

కృనాల్​ వన్డేలకు సరిపోడు..

మరో వైపు శ్రేయస్‌ అయ్యర్‌ గాయం కారణంగా పంత్‌ వన్డేల్లో చోటు దక్కించుకున్నాడని, అతడు తిరిగొస్తే కీపింగ్‌ బాధ్యతలు కేఎల్‌ రాహుల్‌కు అప్పగించాలన్నారు. ఇక కృనాల్‌ పాండ్య గురించి స్పందిస్తూ.. అతడు వన్డే ఫార్మాట్‌కు సరిపోడని, అతడితో పది ఓవర్ల కోటా బౌలింగ్‌ చేయించడం కష్టమని చెప్పారు. కృనాల్‌ టీ20 క్రికెట్‌కే సరిపోతాడని చెప్పారు. చివరగా ఇద్దరు కెప్టెన్ల విషయంపై మాట్లాడిన మాజీ క్రికెటర్‌.. విరాట్‌ కోహ్లీని తొలగించాల్సిన అవసరం లేదన్నాడు. తాను సెలెక్షన్‌ కమిటిలో ఉండగా ఈ ప్రస్తావనే రాలేదన్నారు. కోహ్లీ అన్ని ఫార్మాట్లలో బాగా ఆడుతున్నాడని, ఒకవేళ ఏదైనా ఫార్మాట్‌లో రాణించకపోతే అప్పుడా విషయం గురించి ఆలోచించాలన్నారు. ఇప్పుడైతే ఆ పరిస్థితి లేదని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: భువీని 'శ్రీమంతుడ్ని' చేసిన సన్​రైజర్స్​- ఫన్నీ ట్వీట్​

Last Updated : Mar 30, 2021, 8:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.