ఐపీఎల్ 14వ సీజన్ కోసం దిల్లీ క్యాపిటల్స్ తదుపరి కెప్టెన్‌ను ప్రకటించింది ఫ్రాంఛైజీ. గాయంతో లీగ్‌కు దూరమైన శ్రేయస్ అయ్యర్ స్థానంలో యువ క్రికెటర్ రిషభ్ పంత్‌ను సారథిగా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది.
-
🚨 ANNOUNCEMENT 🚨
— Delhi Capitals (@DelhiCapitals) March 30, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
Rishabh Pant will be our Captain for #IPL2021 ✨@ShreyasIyer15 has been ruled out of the upcoming season following his injury in the #INDvENG series and @RishabhPant17 will lead the team in his absence 🧢#YehHaiNayiDilli
">🚨 ANNOUNCEMENT 🚨
— Delhi Capitals (@DelhiCapitals) March 30, 2021
Rishabh Pant will be our Captain for #IPL2021 ✨@ShreyasIyer15 has been ruled out of the upcoming season following his injury in the #INDvENG series and @RishabhPant17 will lead the team in his absence 🧢#YehHaiNayiDilli🚨 ANNOUNCEMENT 🚨
— Delhi Capitals (@DelhiCapitals) March 30, 2021
Rishabh Pant will be our Captain for #IPL2021 ✨@ShreyasIyer15 has been ruled out of the upcoming season following his injury in the #INDvENG series and @RishabhPant17 will lead the team in his absence 🧢#YehHaiNayiDilli
"శ్రేయస్ నాయకత్వంలో మా జట్టు అత్యున్నత శిఖరాలకు చేరింది. అనుకోకుండా దూరమయ్యాడు. అతడి స్థానంలో సారథిగా రిషభ్ పంత్‌ను నియమిస్తున్నాం. పంత్‌కు ఇదొక సువర్ణావకాశం. అతడికి శుభాకాంక్షలు. అయ్యర్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా" అని దిల్లీ ఛైర్మన్, సహ యజమాని కిరణ్ కుమార్ పేర్కొన్నారు.
"గత ఆరేళ్లుగా ఈ ఫ్రాంఛైజీకి ఆడుతున్నా. ఈ జట్టుకు నాయకత్వం వహించాలనేది నా కల. అదిప్పుడు నెరవేరింది. నాపై నమ్మకముంచిన యాజమాన్యానికి కృతజ్ఞతలు."
-రిషభ్ పంత్, దిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్.
తన తర్వాత సారథ్య బాధ్యతలు చేపట్టడానికి పంత్ సరైన వ్యక్తి అని శ్రేయస్ పేర్కొన్నాడు. దిల్లీ కెప్టెన్‌గా ఎంపికైన రిషభ్‌కు అభినందనలు తెలిపాడు. గతంలో దిల్లీ రాష్ట్ర జట్టుకు నాయకత్వం వహించిన పంత్‌కు.. ఐపీఎల్లో పగ్గాలు చేపట్టడం మాత్రం ఇదే తొలిసారి.
ఇదీ చదవండి: 'క్వారంటైన్'లో బుమ్రా సాధన- ఆర్సీబీ ప్రాక్టీస్ షురూ