ETV Bharat / sports

పంత్​ను ఆట పట్టిస్తున్న నెటిజన్లు.. ఎందుకంటే? - cricket news

భారత యువ వికెట్​ కీపర్​ రిషభ్​పంత్​ను నెటిజన్లు తెగ ట్రోలింగ్ చేస్తున్నారు. ఓ జెర్సీపై అతడు పెట్టిన సంతకం చిన్నపిల్లలు చేసేదిగా ఉందంటూ ఆట పట్టిస్తున్నారు. అదేంటో మీరు చదివేయండి మరి. ​ ​

rishabh-pant-trolled-for-his-signature-on-nathan-lyons-gifted-jersey-from-team-india
ఆన్​లైన్​లో ట్రోల్​ అవుతున్న పంత్​ సంతకం
author img

By

Published : Jan 29, 2021, 1:46 PM IST

టీమ్‌ఇండియా యువ వికెట్‌ కీపర్‌, బ్యాట్స్‌మన్‌ రిషభ్‌పంత్‌ను నెటిజన్లు ట్రోలింగ్‌ చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి తన సంతకాన్ని మార్చుకోలేదని ఆటపట్టిస్తున్నారు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో పంత్‌(274) టీమ్‌ఇండియా తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచిన సంగతి తెలిసిందే. అలాగే గబ్బా టెస్టులో 89* పరుగులతో జట్టును విజయతీరాలకు చేర్చాడు. దాంతో ఒక్కసారిగా హీరోగా మారిన పంత్‌ తాజాగా ఆన్‌లైన్‌లో ట్రోలింగ్‌కు గురయ్యాడు. అదేంటో మీరే తెలుసుకోండి.

గబ్బా టెస్టుతో ఆస్ట్రేలియా స్పిన్నర్‌ నేథన్‌ లైయన్‌ కెరీర్‌లో కీలక మైలురాయి చేరుకున్నాడు. అది అతడికి వందో టెస్టు. కంగారూ జట్టు తరఫున ఈ ఘనత సాధించిన 13వ ఆటగాడిగా నిలిచాడు. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకొని టీమ్‌ఇండియా ఆటగాళ్లు లైయన్‌కు ఎప్పటికీ గుర్తుండిపోయే బహుమతి ఇచ్చారు. ప్రతి ఒక్కరూ ఆటోగ్రాఫ్‌లు చేసిన ఒక జెర్సీని ఆసీస్‌ స్పిన్నర్‌కు అందజేశారు.

rishabh-pant-trolled-for-his-signature-on-nathan-lyons-gifted-jersey-from-team-india
ఆన్​లైన్​లో ట్రోల్​ అవుతున్న పంత్​ సంతకం

తాజగా, ఐసీసీ ఆ ఫోటోను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. అయితే ఆ జెర్సీపై పంత్‌ చేసిన సంతకం చిన్నపిల్లలు చేసే విధంగా ఉందని పలువురు ట్రోలింగ్‌ చేస్తున్నారు. పంత్‌ చిన్నప్పటి నుంచి సంతకాన్ని మార్చుకోలేదని కామెంట్లు పెడుతున్నారు. అలాగే తన సంతకం చివరన స్మైలీ ఎమోజీ జతచేయడంతో నెటిజన్లు మీమ్స్‌తో నవ్వుకుంటున్నారు.

ఇదీ చదవండి: ఇంట్లో వాళ్లు తొందరపెడుతున్నారు: పంత్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.