వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో టీమిండియా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ అరుదైన ఘనత సాధించాడు. మాజీ సారథి ధోనీ రికార్డును బ్రేక్ చేశాడు. భారత్ తరఫున తక్కువ టెస్టుల్లో 50 క్యాచ్‌లు పట్టిన వికెట్ కీపర్‌గా నిలిచాడు.
వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్‌లో ఇషాంత్ వేసిన బంతికి కీపర్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు క్రేగ్ బ్రాత్‌వైట్. ఇది పంత్‌కు 50వ క్యాచ్. కేవలం 11 టెస్టుల్లోనే ఈ ఘనత సాధించాడు. ఫలితంగా అతి తక్కువ టెస్టుల్లో 50 క్యాచ్‌లు పట్టిన భారత వికెట్ కీపర్‌గా నిలిచాడు. ఇందుకోసం ధోనీ 15 మ్యాచ్‌లు తీసుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో టీమిండియా పట్టు బిగించింది. రెండో ఇన్నింగ్స్‌లో 168 పరుగులకు డిక్లేర్ చేసిన కోహ్లీసేన 468 పరుగుల భారీ లక్ష్యాన్ని విండీస్ ముందుంచింది. మూడో రోజు ఆటముగిసే సమయానికి కరీబియన్ జట్టు రెండు వికెట్ల నష్టానికి 45 పరుగులు చేసింది. ఇంకా 423 పరుగులు వెనకబడి ఉంది.
ఇవీ చూడండి.. గోల్డెన్ డకౌట్‌తో విండీస్ టూర్‌ను ముగించిన కోహ్లీ