ETV Bharat / sports

ఇంట్లో వాళ్లు తొందరపెడుతున్నారు: పంత్ - rishabh panth new house news

ఆస్ట్రేలియా పర్యటన అనంతరం ఇంటికి చేరిన పంత్​కు కుటుంబ సభ్యుల నుంచి ఓ ప్రతిపాదన వచ్చినట్లు తెలిపాడు. ఇప్పటికైనా ఓ కొత్త ఇల్లు కొనమని తొందరపెడుతున్నారంటూ పేర్కొన్నాడు. దీంతో తగిన ప్రాంతాన్ని సూచించమని అభిమానులను కోరాడు ఈ యువ బ్యాట్స్​మెన్​.

rishabh-pant-asked-his-fans-to-suggest-him-buying-a-new-house-on-twitter
'కొత్త ఇల్లు కోసం ఇంట్లో వాళ్లు తొందరపెడుతున్నారు'
author img

By

Published : Jan 29, 2021, 1:16 PM IST

ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని వచ్చినప్పటి నుంచి తనని ఓ విషయంలో ఇంట్లోవాళ్లు తొందరపెడుతున్నారని టీమ్‌ఇండియా యువ బ్యాట్స్​మెన్​ రిషభ్‌పంత్‌ తెలిపాడు. ఇటీవల ఆసీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో భారత్‌ చారిత్రక విజయం సాధించడంలో పంత్‌ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడు గతవారం తిరిగి స్వదేశానికి చేరుకున్నాడు.

'నేను ఆస్ట్రేలియా నుంచి తిరిగి వచ్చినప్పటి నుంచి.. ఇప్పుడైనా కొత్త ఇల్లు తీసుకోమని మా ఇంట్లోవాళ్లు వెంటపడుతున్నారు. అందుకోసం గురుగ్రామ్‌ బాగుంటుందా? లేదా వేరే ఏదైనా మంచి ప్రదేశం ఉంటే చెప్పండి' అని అభిమానులను అడిగాడు. కాగా, పంత్‌ పోస్టుకు అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చింది. ముంబయి, నోయిడా, కాన్పూర్‌, ముజఫర్‌నగర్‌ ఇలా అనేక ప్రదేశాలు బాగున్నాయని అభిమానుల నుంచి కామెంట్లు వచ్చాయి.

కాగా, పంత్‌ ఐసీసీ కొత్తగా తీసుకొచ్చిన ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ అవార్డు నామినేషన్లలో ఉన్నాడు. ఆసీస్‌ పర్యటనలో అతడితో పాటు అద్భుత ప్రదర్శన చేసిన రవిచంద్రన్‌ అశ్విన్‌, మహ్మద్‌ సిరాజ్‌, నటరాజన్‌లు సైతం ఆ అవార్డు రేసులో నిలిచారు. వీళ్లంతా టీమ్‌ఇండియా విజయంలో తమవంతు పాత్ర పోషించారు.

ఇదీ చదవండి: 'పరిమిత ఓవర్ల క్రికెట్‌ కోసం పరితపిస్తున్నా'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.