ETV Bharat / sports

ఇంగ్లాండ్​తో చివరి రెండు టెస్టులకూ జడ్డూ దూరం! - ఇంగ్లాండ్​తో మూడు నాలుగు టెస్టులకు జడ్డూ దూరం

ఇంగ్లాండ్​తో టెస్టు సిరీస్​కు టీమ్​ఇండియా ఆల్​రౌండర్​ రవీంద్ర జడేజా పూర్తిగా దూరం కానున్నాడని క్రికెట్​ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే తొలి రెండు మ్యాచులకు దూరమైన అతడు మిగతా రెండు టెస్టులకూ అందుబాటులో ఉండట్లేదని తెలుస్తోంది. ఆస్ట్రేలియా పర్యటనలో అతడికి తగిలిన గాయం మానడానికి ఎక్కువ సమయం పట్టడమే ఇందుకు కారణమని తెలిసింది.

jaddu
జడ్డూ
author img

By

Published : Feb 10, 2021, 9:58 PM IST

అంతా అనుకున్నట్లే జరిగింది. టీమ్​ఇండియాకు ఆల్​రౌండర్​ రవీంద్ర జడేజా విషయంలో మళ్లీ నిరాశే ఎదురైంది. ఇప్పటికే ఇంగ్లాండ్​తో తొలి రెండు టెస్టులకు దూరమైన అతడు మరో రెండు టెస్టులకు అందుబాటులో ఉండట్లేదు. పరిమిత ఓవర్ల సిరీస్‌లోనూ అతడు ఆడేది అనుమానంగా మారింది. ఈ విషయాన్ని క్రికెట్​ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఆస్ట్రేలియాలో జరిగిన మూడో టెస్టులో గాయపడిన జడ్డూ.. ప్రస్తుతం బెంగళూరులోని ఎన్​సీఏ అకాడమీలో చికిత్స తీసుకుంటున్నాడు.

బొటన వేలు ఫ్రాక్చర్ అయిన జడేజాకు ఆస్ట్రేలియాలోనే సర్జరీ జరిగింది. జడ్డూకు కనీసం ఆరు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. అయితే ఇప్పుడు అనుకున్న దాని కన్నా ఎక్కువ సమయం విశ్రాంతి అవసరమయ్యేలా ఉందని తెలిసింది. కాబట్టి అతడు టెస్టు సిరీస్​కు పూర్తిగా దూరమవుతాడని అంటున్నారు. అంతకముందు ఇదే విషయాన్ని ఓ బీసీసీఐ అధికారి కూడా అన్నారు.

ఇప్పటికే అతడి స్థానంలో తొలి టెస్టులో యువ ఆటగాడు నదీమ్​ను తీసుకున్నారు. అయితే అతడు ఆశించిన స్థాయిలో రాణించలేదు. దీంతో అతడిని ఎంచుకోవడంపై తీవ్రంగా విమర్శలు వచ్చాయి. కాబట్టి తనను రెండో టెస్టుకు పక్కనపెట్టి కుల్దీప్​ యాదవ్​కు అవకాశం కల్పించవచ్చు. ఫిబ్రవరి 13 నుంచి చెపాక్​ స్డేడియం వేదికగా రెండో మ్యాచు ప్రారంభంకానుంది. కాగా ఇప్పటికే తొలి మ్యాచులో గెలిచి 1-0తేడాతో ఇంగ్లాండ్​ ఆధిక్యంలో ఉంది.

ఇదీ చూడండి: 'జడేజా లేడు.. ఇంగ్లాండ్​ రెచ్చిపోతోంది'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.