ETV Bharat / sports

భారత్​కు మరో షాక్​.. తొలి టెస్టుకు జడేజా దూరం! - ఆస్ట్రేలియాతో తొలి టెస్టుకు జడేజా దూరం

ఆస్ట్రేలియాతో జరగనున్న తొలి టెస్టుకు టీమ్​ఇండియా ఆల్​రౌండర్​ రవీంద్ర జడేజా దూరమయ్యే అవకాశం ఉంది. తొలి టీ20లో తలకు బంతి తగిలిన కారణంగా మైదానాన్ని వీడిన జడేజాకు మరో మూడు వారాలు విశ్రాంతి అవసరమని బీసీసీఐ వర్గాలు అంటున్నాయి.

Ravindra Jadeja likely to miss the first Test for India
టీమ్​ఇండియాకు మరో షాక్​.. తొలి టెస్టుకు జడేజా దూరం!
author img

By

Published : Dec 7, 2020, 5:43 PM IST

Updated : Dec 7, 2020, 6:15 PM IST

ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్​కు ముందు టీమ్​ఇండియాకు మరో ఎదురుదెబ్బ తగలనుంది. డిసెంబరు 17 నుంచి జరగనున్న తొలి టెస్టుకు టీమ్​ఇండియా ఆల్​రౌండర్​ రవీంద్ర జడేజా అందుబాటులో ఉండకపోవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇటీవలే జరిగిన తొలి టీ20లో జడేజా తలకు బంతి తగిలి అతని స్థానంలో యుజ్వేంద్ర చాహల్​ కంకషన్​ సబ్​స్టిట్యూట్​గా వచ్చాడు.

ఈ నేపథ్యంలో జడేజాకు కనీసం మూడు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది. దీంతో తొలి టెస్టుకు జడ్డూ దూరం కానున్నాడని ప్రచారం జరుగుతోంది. మెల్​బోర్న్​లో జరగనున్న బాక్సింగ్​ డే టెస్టుకూ జడేజా దూరమయ్యే అవకాశం ఉందని బీసీసీఐ వర్గాలు అంటున్నాయి.

ఇదీ చూడండి: క్లీన్​స్వీప్​పై భారత్ గురి.. సీన్​ రిపీట్​ చేస్తారా?

Last Updated : Dec 7, 2020, 6:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.