ETV Bharat / sports

'నేను కూడా అశ్విన్​ను లెజెండ్​ అని పిలుస్తా' - భజ్జీ

టీమ్​ఇండియా స్పిన్నర్ రవిచంద్రన్​ అశ్విన్​ను సీనియర్​ బౌలర్​ హర్భజన్ సింగ్​ ప్రశంసలతో ముంచెత్తాడు. టెస్టు ఫార్మాట్​లో 400 వికెట్లు తీయడం గొప్ప విషయమని పేర్కొన్నాడు. ఈ సారి యాష్​ను కలిసినప్పుడు తాను కూడా లెజెండ్​ అని పిలుస్తానని తెలిపాడు.

Ravichandran Ashwin is a legend of Indian cricket, says Harbhajan
'నేను కూడా అశ్విన్​ను లెజెండ్​ అని పిలుస్తా'
author img

By

Published : Feb 28, 2021, 5:22 AM IST

ఇటీవల టెస్టుల్లో 400 వికెట్లు తీసిన రవిచంద్రన్​ అశ్విన్​పై.. భారత సీనియర్​ స్పిన్నర్​ హర్భజన్​ సింగ్​ ప్రశంసలు కురిపించాడు. సుదీర్ఘ ఫార్మాట్​లో ఇదొక గొప్ప విజయమని కొనియాడాడు.

"టెస్టుల్లో 400 వికెట్లు తీయడమనేది చాలా పెద్ద గొప్ప విషయం. శారీరకంగా, మానసికంగా ఎంతో దృఢంగా ఉండాల్సిన ఫార్మాట్​ ఇది. నాలుగు వందల మందిని ఔట్​ చేసి.. జట్టు విజయాలకు దోహదపడ్డాడు. అశ్విన్​ను లెజెండ్​ అనడంలో ఎటువంటి సందేహం లేదు."

-హర్భజన్​ సింగ్​, టీమ్​ఇండియా సీనియర్​ బౌలర్.

"అశ్విన్​ 400 వికెట్లు తీయకపోయినా.. ఒకవేళ తీసిన బౌలర్​ అతడు కాకపోయినా.. అతన్ని లెజెండ్​ అని పిలిచేవారు కాదు. కానీ, యాష్​ చాలా మ్యాచ్​ల్లో టీమ్​ఇండియాను గెలిపించాడు. ఏదేమైనా కెప్టెన్​ విరాట్​ కోహ్లీ నోటి నుంచి అశ్విన్​ను లెజెండ్​ అని పిలవడం బాగుంది. నేను కూడా ఈ సారి యాష్​ను కలిసినప్పుడు లెజెండ్​ అని పిలుస్తాను" అని హర్భజన్​ తెలిపాడు.

"అహ్మదాబాద్ వేదికగా జరిగిన పింక్​ టెస్టులో అశ్విన్​.. బెన్​ స్టోక్స్​ను 11వ సారి ఔట్​ చేశాడు. ఇది కూడా ఒక పెద్ద రికార్డు. ముఖ్యమైన ఆటగాళ్లను ఎక్కువ సార్లు ఔట్​ చేయడం అతని నేర్పుకు ప్రతీక. అతడు గతంలో డేవిడ్​ వార్నర్​ను పది సార్లు పెవిలియన్​ చేర్చాడు. స్టీవ్​స్మిత్​ కూడా అశ్విన్​ బౌలింగ్​ను ఎదుర్కోవడంలో ఇబ్బందిపడ్డాడు."

"వికెట్లు తీయడమే బౌలర్ల ప్రధాన పని. అలాంటిది ప్రత్యర్థి జట్టులోని కీలకమైన ఆటగాళ్లను చాలా సార్లు ఔట్​ చేయడం గొప్ప విషయం. ఇంగ్లాండ్​ టీమ్​లో జో రూట్​, బెన్​ స్టోక్స్​లు ముఖ్యమైన బ్యాట్​మెన్లు. వారి ప్రదర్శనతో మ్యాచ్​ను తమవైపు లాగేసుకునేంతా సత్తా వారి సొంతం. అటువంటిది ఎక్కువ సార్లు వారిని అశ్విన్​ పెవిలియన్​ పంపాడు. ముందు ముందు కూడా యాష్​ ఈ తరహా వికెట్లు తీయాలని​ కోరుకుంటున్నా" అని భజ్జీ పేర్కొన్నాడు.

ఇదీ చదవండి: 'కేవలం అతడు మాత్రమే మమ్మల్ని అర్థం చేసుకున్నాడు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.