ETV Bharat / sports

'ప్రధాని మోదీ మాటలు శక్తిని ఇస్తాయి'

ప్రధాని మోదీకి భారత క్రికెట్​ ప్రధాన కోచ్ రవిశాస్త్రి​ సహ బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ, కార్యదర్శి జైషా ధన్యవాదాలు తెలిపారు. ఆయన మాటలు టీమ్​ఇండియాలో కొత్త ఉత్తేజాన్ని తీసుకొస్తాయని తెలిపారు.

ravi shastri and ganguly thanked pm modi
థ్యాంక్యూ@మోదీజీ: రవిశాస్త్రి, గంగూలీ
author img

By

Published : Jan 31, 2021, 7:18 PM IST

Updated : Jan 31, 2021, 7:38 PM IST

ఆస్ట్రేలియాపై టెస్ట్ సిరీస్​ గెలిచిన భారత జట్టును 'మన్​ కీ బాత్​' కార్యక్రమం సందర్భంగా మరోసారి కీర్తించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ప్రధాని మాటలు.. ఒత్తిడిలో మరింత రాణించేందుకు దోహదపడతాయన్నారు టీమ్​ఇండియా ప్రధాన కోచ్​ రవిశాస్త్రి. ట్విట్టర్​ వేదికగా మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.

  • Thank you, Sir. Your kind words will further strengthen #TeamIndia and 🇮🇳’s resolve to perform under pressure and in trying circumstances. Jai Hind ! https://t.co/yQQN9nh8Ab

    — Ravi Shastri (@RaviShastriOfc) January 31, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"ధన్యవాదాలు సార్. మీ స్ఫూర్తిదాయక మాటలు టీమ్​ఇండియాను మరింత శక్తిమంతం చేస్తాయి. అలాగే ఒత్తిడిలో సమర్థవంతంగా రాణించేందుకు మరింత బలం చేకూరుస్తాయి. జై హింద్," అని రవిశాస్త్రి ట్వీట్ చేశారు.

బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్​ గంగూలీ కూడా ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు.

  • Sincere thanks and gratitude to Honourable Prime minister for recognising the performance of the Indian cricket team in australia..

    — Sourav Ganguly (@SGanguly99) January 31, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"ఆస్ట్రేలియాలో భారత క్రికెట్ జట్టు ఆటతీరును గుర్తించినందుకు గౌరవనీయ ప్రధానికి హృదయపూర్వక కృతజ్ఞతలు," అని దాదా ట్వీట్​ చేశారు.

రెండోసారి గుండె చికిత్స అనంతరం ఈరోజే(ఆదివారం) ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్​ అయ్యారు.

బీసీసీఐ కార్యదర్శి జై షా కూడా "ప్రోత్సాహకరమైన మాటలకు ధన్యవాదాలు మోదీజీ. మీ మాటలు.. భవిష్యత్ సవాళ్లకు టీమ్​ఇండియా మానసిక స్థైర్యాన్ని, శక్తిని పెంపొందిస్తాయి," అని ట్వీట్​ చేశారు.

ఇదీ చూడండి: టీమ్ఇండియా గెలుపు.. ఎందరికో మేలుకొలుపు !

Last Updated : Jan 31, 2021, 7:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.