ETV Bharat / sports

చారిత్రక ఫస్ట్​క్లాస్​ మ్యాచ్​లో చండీగఢ్ అరుదైన రికార్డు

author img

By

Published : Feb 14, 2020, 12:07 PM IST

Updated : Mar 1, 2020, 7:41 AM IST

చండీగఢ్​- మణిపూర్​ మధ్య జరిగిన రంజీ మ్యాచ్​.. ప్రపంచ క్రికెట్​ చరిత్రలో మరో కీలక అధ్యాయంగా నిలిచిపోయింది. ఇది ప్రపంచ ఫస్ట్​క్లాస్​ చరిత్రలో 60 వేల మ్యాచ్​గా ఘనత సాధించింది. అంతేకాకుండా ఈ మ్యాచ్​ తొలి ఇన్నింగ్స్​లో ఏకంగా 609 పరుగుల ఆధిక్యం అందుకుంది చండీగఢ్​ జట్టు. ఇది భారత క్రికెట్​లో నాలుగో భారీ ఆధిక్యంగా నిలిచింది.

Ranji Trophy 2020: Landmark Ranji Trophy match 60,000 in Kolkata bw Manipur and Chandigarh
చారిత్రక ఫస్ట్​క్లాస్​ మ్యాచ్​లో చండీగఢ్ అరుదైన రికార్డు

రంజీ ట్రోఫీ రౌండ్-9 ప్లేట్ గ్రూపులో భాగంగా మణిపూర్‌-చండీగఢ్ జట్లు తలపడ్డాయి. తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా 609 పరుగులు ఆధిక్యం సాధించింది చండీగఢ్​. భారత క్రికెట్ చరిత్రలో ఇది నాలుగో అత్యధిక తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంగా రికార్డులకెక్కింది.

నాలుగో భారీ ఆధిక్యం..

కోల్​కతా లోని వీడియోకాన్​ అకాడమీ గ్రౌండ్​ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో... మణిపూర్ జట్టు 63 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన చండీగఢ్ తొలి ఇన్నింగ్స్‌ను 672/8 వద్ద డిక్లేర్ చేసింది. బిపుల్ శర్మ, గురీందర్ సింగ్‌లు ద్విశతకాలతో అదరగొట్టారు. కీపర్ ఉదయ్ కౌల్ 148 పరుగులు సాధించాడు. భారత ఫస్ట్ క్లాస్ క్రికెట్‌ చరిత్రలో ఇప్పటి వరకు ఉన్న 3 అత్యధిక తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం రికార్డులు ఇవే.

>> 1945-46 సీజన్‌లో హోల్కర్-మైసూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో హోల్కర్ జట్టు 722 పరుగుల ఆధిక్యం నమోదు చేసింది.

>> 1993-94 సీజన్‌లో హైదరాబాద్‌-ఆంధ్ర జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు 681 పరుగుల ఆధిక్యం సాధించింది.

>> 2014-15 సీజన్‌లో కర్ణాటక-తమిళనాడు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో కర్ణాటక 628 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించింది.

తాజాగా చండీగఢ్ 609 పరుగుల ఆధిక్యం సాధించి ఈ జాబితాలో నాలుగో స్థానంలో నిలిచింది.

అరుదైన మైలురాయి...

ప్రపంచ ఫస్ట్​క్లాస్ క్రికెట్​లో మణిపూర్‌-చండీగఢ్ పోరు​... 60వేల మ్యాచ్​గా రికార్డు సృష్టించింది. తొలి దేశవాళీ మ్యాచ్​ 1771లో హామ్​ష్పైర్​, ఇంగ్లాండ్​ మధ్య జరిగింది. ఆ తర్వాత 150 ఏళ్లకు 10 వేల మ్యాచ్​ 1921లో జరగ్గా.. అందులో యార్క్​షైర్​, ససెక్స్​ జట్లు తలపడ్డాయి. అనంతరం 86 ఏళ్ల తర్వాత శ్రీలంక-ఏ, బంగ్లాదేశ్​-ఏ జట్లు 2007లో 50వేల మైలురాయి మ్యాచ్​లో ఆడాయి.

సర్రే జట్టు (3656) ఎక్కువ ఫస్ట్​క్లాస్​ మ్యాచ్​లు ఆడిన జట్టుగా నిలిచింది. యార్క్​షైర్ ​(3647), ససెక్స్ ​(3524) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. యార్క్​షైర్​ 1531 విజయాలతో ఎక్కువ విజయాలు సాధించిన జట్టుగా అగ్రస్థానం సంపాదించుకుంది.

Last Updated : Mar 1, 2020, 7:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.