యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్ - ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో టెస్టులో తొలి రోజు వర్షం కారణంగా తుడిచి పెట్టుకుపోయింది. లార్డ్స్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఒక్క బంతి కూడా పడలేదు. టాస్ వేసేందుకూ వీలు పడలేదు.
పదే పదే వరణుడు అడ్డుపడుతూ.. మ్యాచ్ నిర్వహణకు కష్టంగా మారాడు. ఐదు రోజుల ఆటలో ఇంకా నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి.
తొలి టెస్టులో అనూహ్యంగా పుంజుకున్న ఆసీస్.. 251 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఆ టెస్టులో మొదటి మూడు రోజులు ఆధిపత్యం చెలాయించిన ఇంగ్లాండ్.. చివరి రెండు రోజుల్లో విఫలమై మ్యాచ్‌ను కంగారూ జట్టు చేతిలో పెట్టింది.
ఇది చదవండి: భారత్‌దే సిరీస్.. కోహ్లీ ఖాతాలో మరో సెంచరీ