ETV Bharat / sports

కివీస్​తో మ్యాచ్​లో ఒడి ఒడి బా, బేడా బేడా - IND vs NZ

న్యూజిలాండ్​తో జరిగిన చివరి వన్డేలో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. టీమిండియా బ్యాటింగ్ సమయంలో కేఎల్ రాహుల్, మనీష్ పాండే కన్నడ భాషలో మాట్లాడుకుంటూ అలరించారు.

రాహుల్
రాహుల్
author img

By

Published : Feb 12, 2020, 6:03 PM IST

Updated : Mar 1, 2020, 2:52 AM IST

భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన చివరిదైన మూడో వన్డేలో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. టీమిండియా బ్యాటింగ్ సమయంలో కేఎల్ రాహుల్, మనీష్ పాండే కన్నడ భాషలో మాట్లాడుకుంటూ కనిపించారు. ఈ మాటలు మైదానంలోని మైకుల్లో రికార్డయ్యాయి.

బర్తీరా (నువ్వు వస్తావా), ఒడి ఒడి బా (రా పరుగెత్తు), బేడా బేడా ( వద్దు వద్దు), బా బా (వచ్చేయ్) అన్న మాటలు మైకుల్లో రికార్డయ్యాయి. ఇవి విన్న కన్నడ క్రికెట్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఈ మ్యాచ్​లో రాహుల్ 107 బంతుల్లో 112 పరుగులు సాధించి టీమిండియా మంచి స్కోర్ సాధించడంలో ముఖ్యపాత్ర పోషించాడు. మనీష్ పాండే 42 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఫలితంగా టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 296 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన న్యూజిలాండ్ 47.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించింది. సిరీస్​ను 3-0 తేడాతో గెలుచుకుంది.

Last Updated : Mar 1, 2020, 2:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.