ఐసీసీ విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్లో టీమిండియా ఆటగాడు రాహల్ ఆరోస్థానంలో నిలిచాడు. కోహ్లీ 9, ధావన్ 15వ ర్యాంకుల్లో ఉన్నారు.
శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్లో సత్తాచాటిన టీమిండియా బ్యాట్స్మన్ కేఎల్ రాహుల్ 760 పాయింట్లతో ఆరోస్థానాన్ని కాపాడుకున్నాడు. భారత్ తరఫున ఇతడే టాప్ ర్యాంకర్ కావడం గమనార్హం. వన్డే, టీ20ల్లో అగ్రస్థానంలో ఉన్న కోహ్లీ పొట్టి ఫార్మాట్లో టాప్-10లో నిలిచాడు. ప్రస్తుతం 9వ స్థానంలో ఉన్నాడు. ధావన్ 15వ ర్యాంకులో నిలిచాడు. పాకిస్థాన్ బ్యాట్స్మన్ బాబర్ ఆజామ్, ఆసీస్ ఆటగాడు ఫించ్ మొదటి రెండు స్థానాల్లో ఉన్నారు.
బౌలర్ల ర్యాంకింగ్స్లో ఒక్క భారత బౌలర్ టాప్-10లో లేకపోవడం గమనార్హం. లంక సిరీస్లో సత్తాచాటిన నవదీప్ సైనీ 146 స్థానాలు అధిగమించి 98వ ర్యాంకుకు చేరుకున్నాడు. శార్దూల్ ఠాకూర్ 92వ ప్లేస్లో ఉన్నాడు. భారత్ నుంచి వాషింగ్డన్ సుందర్ 14వ ర్యాంకే టీమిండియాకు ఉత్తమం.
జట్టు ర్యాంకింగ్స్లో భారత్ ఐదో స్థానంలో కొనసాగుతోంది. పాకిస్థాన్, ఆస్ట్రేలియా తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.
ఇవీ చూడండి.. బుమ్రా గురించి ఎక్కువగా ఆలోచించం: ఫించ్