ETV Bharat / sports

రెండు నెలల్లోనే రెండో 'డబుల్' కొట్టిన జూ.ద్రవిడ్ - క్రికెట్ వార్తలు

ఇటీవలే కాలంలో తన బ్యాటింగ్​తో అలరిస్తున్న జూనియర్ ద్రవిడ్ సమిత్.. మరోసారి డబుల్​ సెంచరీ చేసి వార్తల్లో నిలిచాడు.

రెండు నెలల్లో రెండో 'డబుల్' కొట్టిన జూ.ద్రవిడ్
సమిత్ ద్రవిడ్
author img

By

Published : Feb 18, 2020, 6:01 PM IST

Updated : Mar 1, 2020, 6:12 PM IST

మైదానంలో పరుగుల వరద పారిస్తున్న సమిత్‌ ద్రవిడ్‌.. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నాడు. టీమిండియా మాజీ క్రికెటర్ రాహుల్‌ ద్రవిడ్‌కు పుత్రోత్సాహం కలిగిస్తున్నాడు. ఇప్పుడు రెండు నెలల వ్యవధిలోనే రెండో డబుల్‌ సెంచరీ చేసి అదరగొట్టాడు.

మాల్యా అదితి అంతర్జాతీయ పాఠశాల తరఫున అండర్‌-14 బీటీఆర్‌ షీల్డ్‌ మ్యాచ్​లో శ్రీ కుమారన్‌ జట్టుపై అద్వితీయ ద్విశతకం సాధించాడు. 33 బౌండరీలు బాది 204 పరుగులు చేశాడు. తన జట్టును 377/3తో నిలిపాడు. ఛేదనలోనూ బంతితో రాణించాడు. రెండు వికెట్లు తీశాడు. ఇతర బౌలర్లు రాణించడం వల్ల ప్రత్యర్థి జట్టు 110 పరుగులకే కుప్పకూలింది. సమిత్‌ జట్టు 267 పరుగుల తేడాతో ఘన విజయం అందుకుంది.

RAHUL DRAVID
భారత మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్

గతేడాది డిసెంబర్​లో జరిగిన అండర్‌-14 రాష్ట్ర స్థాయి క్రీడల్లోనూ సమిత్‌ ద్రవిడ్‌ రాణించాడు. కోల్‌కతాలో అండర్‌-14 జోనల్‌ టోర్నీలో వైస్‌ ప్రెసిడింట్స్‌ ఎలెవన్ తరఫున ధార్వాడ్‌ జోన్‌పై 201 పరుగులు చేశాడు. 256 బంతులు ఆడిన అతడు 22 బౌండరీలు బాదాడు. రెండో ఇన్నింగ్స్‌లోనూ 94 పరుగులతో నాటౌట్​గా నిలిచాడు. బంతితో రాణించి 3 వికెట్లు తీశాడు.

ఇది చదవండి: సచిన్​, ద్రవిడ్​ తర్వాత ఈ యువ క్రికెటర్​దే రికార్డు!

Last Updated : Mar 1, 2020, 6:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.