ETV Bharat / sports

జూనియర్​ ద్రవిడ్​ మరో 'డబుల్' సెంచరీ మిస్ - dravid latest news

క్రికెట్​ మైదానంలో పరుగుల వరద పారిస్తున్న సమిత్‌ ద్రవిడ్‌.. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నాడు. టీమిండియా మాజీ క్రికెటర్ రాహుల్‌ ద్రవిడ్‌కు పుత్రోత్సాహం కలిగిస్తున్నాడు. ఇటీవలే రెండో డబుల్‌ సెంచరీ చేసిన ఈ బుడతడు.. తాజాగా మరో డబుల్​ చేసే అవకాశం కోల్పోయాడు.

Rahul Dravid Son Samit missed another Double ton even Splendid All-Round Show In U-14 Cricket
జూనియర్​ ద్రవిడ్​ మరో 'డబుల్' సెంచరీ మిస్
author img

By

Published : Feb 26, 2020, 6:30 AM IST

Updated : Mar 2, 2020, 2:39 PM IST

టీమిండియా మాజీ సారథి రాహుల్ ద్రవిడ్ కొడుకు సమిత్ ద్రవిడ్ మళ్లీ చెలరేగి ఆడాడు. బ్యాటింగ్​, బౌలింగ్​లో రాణించి వావ్​ అనిపించుకున్నాడు. రెండునెలల్లోనే రెండు డబుల్ సెంచరీలు బాదిన సమిత్.. తాజాగా మరో ద్విశతకం చేసే అవకాశాన్ని మిస్సయ్యాడు. 166 రన్స్​ చేసి ఔటయ్యాడు.

24 బౌండరీలతో...

బీటీఆర్ షీల్డ్ అండర్-14లో భాగంగా మంగళవారం విద్యాశిల్ప్ అకాడమీ, మాల్యా అదితి ఇంటర్నేషనల్​ జట్ల మధ్య మ్యాచ్​ జరిగింది. ఈ మ్యాచ్‌లో సమిత్ బ్యాట్‌తో రెచ్చిపోయాడు. 131 బంతుల్లో 24 బౌండరీలతో 166 పరుగులు చేసి ఔటయ్యాడు. మరోవైపు బంతితోనూ సత్తా చాటాడు. నాలుగు వికెట్లు పడగొట్టి.. తమ జట్టు మాల్యా అదితి స్కూల్ సెమీఫైనల్​ చేరడంలో కీలక పాత్ర పోషించాడు.

ఈ మ్యాచ్‌లో సమిత్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 330 పరుగులు చేసింది. అనంతరం 331 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన విద్యాశిల్ప్ అకాడమీ జట్టు 38.5 ఓవర్లలో 182 పరుగులకు ఆలౌట్ అయింది.

రెండు 'ద్విశతకాలు​'

ఈ నెల 15న..శ్రీ కుమరన్ చిల్డ్రన్స్ అకాడమీ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో డబుల్ సెంచరీ చేశాడు సమిత్​. 146 బంతుల్లో 33 బౌండరీలతో ద్విశకతం బాదాడు. గతేడాది డిసెంబర్​లో జరిగిన అండర్‌-14 రాష్ట్ర స్థాయి క్రీడల్లోనూ సమిత్‌ ద్రవిడ్‌ రాణించాడు. కోల్‌కతాలో అండర్‌-14 జోనల్‌ టోర్నీలో వైస్‌ ప్రెసిడింట్స్‌ ఎలెవన్ తరఫున ధార్వాడ్‌ జోన్‌పై 201 పరుగులు చేశాడు. 256 బంతులు ఆడిన అతడు 22 బౌండరీలు బాదాడు. రెండో ఇన్నింగ్స్‌లోనూ 94 పరుగులతో నాటౌట్​గా నిలిచాడు. బంతితోనూ రాణించి 3 వికెట్లు తీశాడు.

Last Updated : Mar 2, 2020, 2:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.