భారత అత్యుత్తమ టెస్టు బ్యాట్స్‌మన్ ఎవరు? అని విజ్డెన్ ఇండియా నిర్వహించిన పోల్‌లో దిగ్గజ సచిన్‌ను అధిగమించాడు మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్. మొత్తం వేసిన 11,400 ఓట్లలో ద్రవిడ్ 52 శాతం దక్కించుకుని విజేతగా నిలిచాడు. ఇతడి తర్వాతి స్థానాల్లో సచిన్, గావస్కర్, కోహ్లీ నిలిచారు.
ముందుతరంలో ఆడిన సచిన్, ద్రవిడ్.. ప్రపంచ ఉత్తమ బ్యాట్స్‌మెన్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. వన్డేల్లో, టెస్టులో చెరో 10 వేలకుపైగా పరుగులు చేశారు. అయితే ద్రవిడ్ డిఫెన్సివ్‌గా ఆడి పేరు తెచ్చుకోగా, సచిన్ మాత్రం అద్భుతమైన స్ట్రోక్ బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. వీరిద్దరూ భారత జట్టుకు కెప్టెన్‌గానూ కొంతకాలం పనిచేశారు.
టెస్టుల్లో 164 మ్యాచ్‌లాడిన ద్రవిడ్.. 52.31 సగటులో 13,288 పరుగులు చేయగా, సచిన్ 200 మ్యాచ్‌ల్లో 53.78 సగటుతో 15,921 పరుగులు చేయడం విశేషం.
ఇవీ చదవండి:
- సచిన్, కోహ్లీ, బాలీవుడ్‌పై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు
- వైకల్యాన్ని జయించిన బాలుడు.. సచిన్ మెచ్చిన క్రికెటర్!
- మోసపోయిన సచిన్ తెందూల్కర్ వీరాభిమాని..!
- సచిన్ రికార్డ్... 9 నిమిషాల్లో 45 కప్పుల టీ స్వాహా
- సచిన్ విషయంలో ఆ రెండు తప్పులు చేశా: బక్నర్
- 'సచిన్ అందుకే కెప్టెన్‌గా సక్సెస్ కాలేదు'
- ఆ దేశంలోని రోడ్లకు సచిన్, కోహ్లీల పేర్లు
- 2007లోనే సచిన్ రిటైర్ కావాలనుకున్నాడు!
- 'సచిన్‌ను ఔట్ చేసినందుకు చంపేస్తామన్నారు'
- 'ఇప్పట్లో అయితే సచిన్ లక్ష బాదేవాడు'
- 'కోహ్లీ కంటే సచినే ఉత్తమ క్రికెటర్'