టీమ్ఇండియా తాత్కాలిక టెస్టు కెప్టెన్ అజింక్య రహానె రాకతో డ్రస్సింగ్ రూమ్లో ప్రశాంతత పెరిగిందని స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. అదే మైదానంలో బాగా రాణించడానికి కారణమైందని చెప్పాడు. తొలి పోరులో ఓడినా సరే బాక్సింగ్ డే టెస్టులో పుంజుకున్నామని మ్యాచ్ అనంతరం జరిగిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
-
Post win shenanigans: Reactions post #TeamIndia's series-leveling win at MCG#TeamIndia members speak about what makes the second Test win at the MCG so special - by @Moulinparikh
— BCCI (@BCCI) December 29, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
📹📹 https://t.co/eyFXTaeJXU #AUSvIND pic.twitter.com/V0YRwA2KuD
">Post win shenanigans: Reactions post #TeamIndia's series-leveling win at MCG#TeamIndia members speak about what makes the second Test win at the MCG so special - by @Moulinparikh
— BCCI (@BCCI) December 29, 2020
📹📹 https://t.co/eyFXTaeJXU #AUSvIND pic.twitter.com/V0YRwA2KuDPost win shenanigans: Reactions post #TeamIndia's series-leveling win at MCG#TeamIndia members speak about what makes the second Test win at the MCG so special - by @Moulinparikh
— BCCI (@BCCI) December 29, 2020
📹📹 https://t.co/eyFXTaeJXU #AUSvIND pic.twitter.com/V0YRwA2KuD
"36 పరుగులకే ఆలౌట్ అవ్వడం సాధారణ విషయం కాదు. తొలి టెస్టులో ఓడిన తర్వాత అంతే వేగంగా గెలవడం మా జట్టుకు గర్వకారణం. రహానె కెప్టెన్ అయిన తర్వాత డ్రస్సింగ్ రూమ్లో ప్రశంతమైన వాతావరణం వచ్చింది. ఆ ప్రశాంతతే మైదానంలో రాణించడానికి కారణమై ఉండొచ్చు. ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఆర్డర్లో స్టీవ్ స్మిత్ ఔట్ అవ్వకపోయి ఉంటే మా విజయం కొంచెం కష్టమయ్యేది. అతడిని ఔట్ చేయడానికి ముందుగా అనుకున్న ప్రణాళికలను సరిగ్గా అమలు చేశాం"
- రవిచంద్రన్ అశ్విన్, టీమ్ఇండియా స్పిన్నర్
ఆస్ట్రేలియాతో బాక్సింగ్ డే టెస్టులో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా నిర్దేశించిన 70 పరుగుల లక్ష్యాన్ని రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది టీమ్ఇండియా. కెప్టెన్ రహానె(27*), ఓపెనర్ గిల్(35*) ఆకట్టుకున్నారు. దీంతో సిరీస్ 1-1తో సమమైంది.
ఇదీ చూడండి: సిడ్నీలోనే మూడో టెస్టు..ఆసీస్ బోర్డు ట్వీట్