ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో పాల్గొనేందుకు దుబాయ్ వెళ్లాడు రవిచంద్రన్ అశ్విన్. దిల్లీ క్యాపిటల్స్ తరఫున ఈ సీజన్ ఆడనున్నాడు. ఈ క్రమంలోనే మాట్లాడుతూ.. బ్యాట్సమెన్కు ఫ్రీ-హిట్ ఉన్నట్లే బౌలర్లకు ఫ్రీ బాల్ ఉండాలని అభిప్రాయపడ్డాడు. తద్వారా వారిద్దరి మధ్య గట్టి పోటీ ఉంటుందని అన్నాడు. మన్కడింగ్‌కు ప్రత్యామ్నాయంగా ఈ నిబంధన తీసుకురావాలని తెలిపాడు. సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకు ప్రస్తుత సీజన్ జరగనుంది.
-
Make it a free ball for the bowler. If the batsmen gets out of that ball, the batting team will be docked 5 runs. Free hit adds to the drama for a batter, let’s give a chance to the bowlers too. As of now everyone watches the game hoping that ‘the bowlers will get smacked today’ https://t.co/BxX8IsMgvF
— Ashwin 🇮🇳 (@ashwinravi99) August 24, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Make it a free ball for the bowler. If the batsmen gets out of that ball, the batting team will be docked 5 runs. Free hit adds to the drama for a batter, let’s give a chance to the bowlers too. As of now everyone watches the game hoping that ‘the bowlers will get smacked today’ https://t.co/BxX8IsMgvF
— Ashwin 🇮🇳 (@ashwinravi99) August 24, 2020Make it a free ball for the bowler. If the batsmen gets out of that ball, the batting team will be docked 5 runs. Free hit adds to the drama for a batter, let’s give a chance to the bowlers too. As of now everyone watches the game hoping that ‘the bowlers will get smacked today’ https://t.co/BxX8IsMgvF
— Ashwin 🇮🇳 (@ashwinravi99) August 24, 2020
"బౌలర్ బంతిని విసిరేలోపు, బ్యాట్స్‌మన్ నాన్ స్ట్రైకర్ ఎండ్ దాటితే, తర్వాతి బంతిని ఫ్రీబాల్గా ప్రకటించాలి. ఒకవేళ వేసిన బంతికి బ్యాట్స్‌మన్ ఔటైతే బ్యాటింగ్ చేస్తున్న జట్టుకు ఐదు పరుగులు తగ్గించాలి. ఫ్రీ హిట్ అనేది బ్యాట్స్‌మన్‌కు అవకాశం కల్పిస్తుంది. అది బౌలర్లకు కూడా ఇవ్వాలని కోరుతున్నాను"
-అశ్విన్, టీమ్ఇండియా ఆఫ్ స్పిన్నర్
గతేడాది కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరఫున ఆడిన అశ్విన్.. రాజస్థాన్‌తో మ్యాచ్‌లో ఆ జట్టు బ్యాట్స్‌మన్ జోస్ బట్లర్‌ను మన్కడింగ్ విధానంలోనే ఔట్ చేశాడు. అది అప్పట్లో పలు విమర్శలకు దారి తీసింది. ఈ ఏడాది ఐపీఎల్లో మాత్రం అలా చేయడానికి వీల్లేదని దిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ అశ్విన్‌కు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఫ్రీ బాల్ నిబంధనను తెరపైకి తీసుకొచ్చాడు అశ్విన్.
ఇది చూడండి : చీఫ్ సెలెక్టర్ పదవి నుంచి మిస్బాకు ఉద్వాసన!