ETV Bharat / sports

సౌతాఫ్రికా టెస్టు జట్టు కెప్టెన్​గా డికాక్​

రానున్న శ్రీలంక పర్యటన కోసం క్రికెట్​ దక్షిణాఫ్రికా జట్టును ప్రకటించింది. పరిమిత ఓవర్ల ఫార్మాట్​లో కెప్టెన్​గా రాణిస్తున్న క్వింటన్​ డికాక్​కు టెస్టు జట్టు పగ్గాలు అప్పగిస్తున్నట్లు బోర్డు డైరెక్టర్​ గ్రేమ్​ స్మిత్​ తెలిపాడు.

Quinton De Kock appointed South Africa's Test captain for 2020-21
సౌతాఫ్రికా టెస్టు కెప్టెన్​గా క్వింటన్ డికాక్​
author img

By

Published : Dec 11, 2020, 5:49 PM IST

క్వింటన్​ డికాక్​ను టెస్టు జట్టుకు కెప్టెన్​గా నియమిస్తున్నట్లు క్రికెట్​ దక్షిణాఫ్రికా శుక్రవారం ప్రకటించింది. వైట్​బాల్​ కెప్టెన్​గా డికాక్​ అద్భుతంగా రాణిస్తున్నందున టెస్టు జట్టు బాధ్యతలు తనకే అప్పగించాలని క్రికెట్​ సౌతాఫ్రికా డైరెక్టర్​ గ్రేమ్​ స్మిత్​ తెలిపాడు.

డిసెంబరు 26 నుంచి శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్​ ప్రారంభంకానున్న నేపథ్యంలో క్రికెట్​ దక్షిణాఫ్రికా జట్టును ప్రకటించింది. ఇందులో సారెల్ ఎర్వీ, గ్లెంటన్​ స్టుర్మాన్​, కైల్​ వెర్రీన్​ వంటి కొత్త ఆటగాళ్లను జట్టులోకి తీసుకున్నారు. గాయాలతో బాధపడుతున్న కగిసో రబాడా, డ్వైన్​ ప్రిటోరియస్​లను ఎంపిక చేయలేదు. కోలుకున్న తర్వాత వారిని జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది.

దక్షిణాఫ్రికా టెస్టు స్క్వాడ్​: క్వింటన్​ డికాక్​ (కెప్టెన్​), టెంబ బవుమా, ఐడెన్​ మర్క్రమ్, ఫాఫ్​ డుప్లెసిస్​, బ్యూరాన్​ హెన్రిక్స్​, ఎల్గర్​, కేశవ్​ మహారాజ్​, లుంగి ఎంగిడి, రాస్సీ వాన్​ డెర్​ డుసెన్​, సారెల్​ ఎర్వీ, ఎన్రిచ్​ నోర్ట్జే, గ్లెంటన్​ స్టుర్మాన్​, వియాన్​ ముల్డర్, కీగన్ పీటర్సన్, కైల్​​ వెర్రిన్నే.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.