ETV Bharat / sports

'ఫైనల్​ చేరడం జీవితంలో అద్భుతమైన అనుభూతి' - దిల్లీ క్యాపిటల్స్​

ఐపీఎల్​లో తొలిసారి ఫైనల్​ చేరడంపై ఆనందం వ్యక్తం చేశాడు దిల్లీ క్యాపిటల్స్​ కెప్టెన్​ శ్రేయస్​ అయ్యర్​. తన జీవితంలో గొప్ప అనుభూతని పేర్కొన్నాడు. ఆదివారం జరిగిన పోరులో హైదరాబాద్​పై 17 పరుగుల తేడాతో విజయం సాధించింది దిల్లీ. నవంబర్​ 10న ముంబయి ఇండియన్స్​తో జరగనున్న ఫైనల్లో అమీతుమీ తేల్చుకోనుంది.

Shreyas Iyer
ఫైనల్​ చేరడం ఓ అద్భుతమైన అనుభూతి: శ్రేయస్​
author img

By

Published : Nov 9, 2020, 4:32 AM IST

ఐపీఎల్​ 13వ సీజన్​లో చరిత్ర సృష్టించింది దిల్లీ క్యాపిటల్స్​. గత 12 సీజన్లుగా ఒక్కసారి ఫైనల్ చేరని దిల్లీ జట్టు.. ఈ ఏడాది ఆ కల నెరవేర్చుకుంది. ఆదివారం హైదరాబాద్​తో జరిగిన పోరులో 17 పరుగులతో నెగ్గి... తొలిసారి టైటిల్​ పోరుకు అర్హత సాధించింది. అయితే సన్​రైజర్స్​పై విజయం అనంతరం మాట్లాడిన దిల్లీ కెప్టెన్​ శ్రేయస్​ అయ్యర్​.. ఇది తన జీవితంలోనే ఓ అద్భుతమైన అనుభూతని అభిప్రాయపడ్డాడు.

" ఇదొక అద్భుతమైన అనుభూతి. ఈ పర్యటనలో చాలా ఎత్తుపల్లాలు చూశాం. అయితే చివరికి మేమంతా ఓ కుటుంబంగానే ఉన్నాం. జట్టులోని ప్రతి ఒక్కరి ప్రయత్నాన్ని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఈ పర్యటన​ చాలా విషయాలు నేర్పింది. కెప్టెన్​గా ఉంటే చాలా బాధ్యతలు ఉంటాయి. అయితే కోచ్​లు, సహాయక సిబ్బంది నుంచి చాలా మద్దతు పొందుతున్నా. అన్నింటికన్నా జట్టు చాలా ప్రత్యేకమైనది. ఇలాంటి బృందం కలిగి ఉండటం నిజంగా అదృష్టం. తర్వాతి మ్యాచ్​లోనూ బలమైన ముంబయి జట్టుపై స్వేచ్ఛగా ఆడాలనుకుంటున్నాం. మేము దాదాపు ప్రతి ఓవర్​లో 10 రన్​రేటుతో పరుగులు చేయాలనుకున్నాం. రషీద్​ మిడిల్​ ఓవర్లలో పరుగులు నియంత్రిస్తాడని మాకు తెలుసు. అందుకే అతడికి వికెట్లు సమర్పించుకోకూడదని నిర్ణయించుకున్నాం. మా జట్టుకు ఓపెనింగ్​ భాగస్వామ్యం లోపిస్తోంది. అందుకే రాకెట్​ వేగంతో ఆరంభం కావాలని అనుకున్నాం. స్టాయినిస్​ ఓపెనర్​గా వెళ్లి ఎక్కువ బంతులు ఆడితే కచ్చితంగా మంచి ఆరంభం వస్తుందని తెలుసు".

--శ్రేయస్​ అయ్యర్​, దిల్లీ క్యాపిటల్స్​ కెప్టెన్​

సన్​రైజర్స్​తో జరిగిన మ్యాచ్​లో తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన దిల్లీ.. నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లకు 189 పరుగులు చేసింది. స్టాయినిస్​(38; 27 బంతుల్లో, 5 ఫోర్లు, 1 సిక్సర్​), శిఖర్‌ ధావన్‌ (78; 50 బంతుల్లో, 6 ఫోర్లు, 2 సిక్సర్లు) అదరగొట్టగా.. ఆఖర్లో హెట్​మెయిర్​(42) చెలరేగాడు.

అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన వార్నర్‌సేన ఎనిమిది వికెట్లు కోల్పోయి 172 పరుగులకే పరిమితమైంది. విలియమ్సన్‌ (67; 45 బంతుల్లో, 5 ఫోర్లు, 4 సిక్సర్లు), అబ్దుల్ సమద్‌ (33; 16 బంతుల్లో, 2 ఫోర్లు, 2 సిక్సర్లు) పోరాడారు. సన్​రైజర్స్​ జట్టును రబాడ (4/29), స్టాయినిస్ (3/26) ఘోరంగా దెబ్బతీశారు. పేలవ ఫీల్డింగ్‌తో హైదరాబాద్ అవకాశాలు చేజార్చుకుంది. ముంబయి,దిల్లీ జట్ల మధ్య మంగళవారం లీగ్‌ ఫైనల్ జరగనుంది.‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.