ETV Bharat / sports

రంజీట్రోఫీ ఫైనల్​: రెండో రోజు పట్టుబిగించిన సౌరాష్ట్ర - saurashtra vs bengal

రంజీట్రోఫీ ఫైనల్​లో సౌరాష్ట్ర, బంగాల్​ జట్ల మధ్య పోరు నడుస్తోంది. మొదటి రోజు 206 పరుగులు చేసిన సౌరాష్ట్ర.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్ల నష్టానికి 384 పరుగులు చేసింది.

Pujara, Vasavada wear down Bengal with marathon stand on day two
రంజీట్రోఫీ ఫైనల్​: రెండో రోజు పట్టు సాధించిన సౌరాష్ట్ర
author img

By

Published : Mar 10, 2020, 9:36 PM IST

రాజ్​కోట్​ వేదికగా బంగాల్​, సౌరాష్ట్ర జట్ల మధ్య రంజీట్రోఫీ ఫైనల్​ జరుగుతోంది. తొలిరోజు బ్యాటింగ్​లో ఇబ్బంది పడిన సౌరాష్ట్ర, రెండో రోజు పట్టు సాధించింది. ఆట ముగిసే సమయానికి 8 వికెట్లు కోల్పోయి 384 పరుగులు చేసింది.

మొదటి రోజు అనారోగ్యం కారణంగా మైదానం వీడిన టీమిండియా టెస్టు బ్యాట్స్​మన్​ ఛెతేశ్వర్​ పుజారా.. రెండో రోజు బరిలో దిగి 66 పరుగులు సాధించాడు. ఇందుకు 237 బంతులు తీసుకున్నాడు. బంగాల్​ బౌలర్​ ముకేశ్​ కుమార్​ బౌలింగ్​లో ఎల్బీగా ఔటయ్యాడు పుజారా.

మరో ఆటగాడు అర్పిత్​ శతకంతో అదరగొట్టాడు. 287 బంతులు ఆడి 106 పరుగులు చేసి పెవిలియన్​ చేరాడు. వీరిద్దరి భాగస్వామ్యం వల్ల జట్టు భారీ స్కోరు దిశగా సాగుతోంది.

Pujara, Vasavada wear down Bengal with marathon stand on day two
పుజాారా, అర్పిత్​

పిచ్​ అస్సలు బాగోలేదు

రాజ్​కోట్​లో జరుగుతోన్న రంజీట్రోఫీ ఫైనల్​ మ్యాచ్​లో పిచ్​ అస్సలు బాగోలేదని బంగాల్​ జట్టు కోచ్​ అరుణ్​ లాల్​ ఆరోపించాడు. ఈ విషయాన్ని బీసీసీఐ పరిగణలోకి తీసుకోవాలని సూచించాడు.

అంపైర్​కు గాయం

సౌరాష్ట్ర, బంగాల్‌ మధ్య జరుగుతున్న ఫైనల్‌ మ్యాచ్‌లో ఫీల్డ్‌ అంపైర్‌ షంషుద్దీన్‌ తీవ్రంగా గాయపడ్డాడు. సోమవారం తొలి రోజు ఆటలో లెగ్‌ అంపైర్‌గా బాధ్యతలు నిర్వరిస్తున్న సమయంలో.. బెంగాల్‌ ఫీల్డర్‌ విసిరిన బంతి నేరుగా వచ్చి అతడి ఉదర భాగంలో బలంగా తాకింది. ఫలితంగా అంపైర్‌ మైదానంలోనే కుప్పకూలిపోయాడు. అతడి స్థానంలో టీవీ అంపైర్‌గా వ్యవహరిస్తున్న ఎస్‌ రవి, తొలి రోజు ఆటలో ఫీల్డ్‌ అంపైర్‌గా బాధ్యతలు తీసుకున్నాడు. అయితే అదే సమయంలో షంషుద్దీన్‌ టీవీ అంపైర్‌గా వ్యవహరించాడు.

ఇదీ చూడండి.. 'ఇదేం పిచ్​.. బంతి అస్సలు కదలట్లేదు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.