ETV Bharat / sports

పాకిస్థాన్​ సూపర్​లీగ్​ విజేత కరాచీ కింగ్స్​ - పాకిస్థాన్ సూపర్​ లీగ్​ 2020 వార్తలు

పాకిస్థాన్​ సూపర్​లీగ్​ విజేతగా కరాచీ కింగ్స్​ నిలిచింది. లాహోర్​ ఖలందర్స్​ జట్టుపై 5 వికెట్ల తేడాతో గెలుపొంది.. తొలిసారి ట్రోఫీని దక్కించుకుంది. కరాచీ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన బాబర్​ అజామ్​ ప్లేయర్​ ఆఫ్​ ది మ్యాచ్​గా ఎంపికయ్యాడు.

PSL Final: Karachi Kings thrash Lahore Qalandars to win their 1st title
పాకిస్థాన్​ సూపర్​లీగ్​ విజేత కరాచీ కింగ్స్​
author img

By

Published : Nov 18, 2020, 9:41 AM IST

మంగళవారం రాత్రి జరిగిన పాకిస్థాన్​ సూపర్​లీగ్​ ఫైనల్లో కరాచీ కింగ్స్​ విజేతగా నిలిచింది. తుదిపోరులో లాహోర్​ ఖలందర్స్​పై 5 వికెట్ల తేడాతో కరాచీ జట్టు గెలుపొందింది. బాబర్ అజామ్ అజేయంగా 49 బంతుల్లో 63 పరుగులు చేసి తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. దీంతో పీఎస్​ఎల్​లో తొలిసారి ఛాంపియన్​గా కరాచీ కింగ్స్​ అవతరించింది.

మొదట బ్యాటింగ్‌ చేసిన లాహోర్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 134 పరుగులు చేసింది. తమిమ్‌ ఇక్బాల్‌ (35) టాప్‌ స్కోరర్‌. వకాస్‌ మహ్మద్‌ (2/18), అర్షద్‌ ఇక్బాల్‌ (2/26), అసిఫ్‌ (2/18) ప్రత్యర్థిని కట్టడి చేశారు.

ఛేదనలో 49 పరుగులకే రెండు వికెట్లు పడినా.. బాబర్‌ అజామ్‌ (63 నాటౌట్‌), వాల్టన్‌ (22), ఇమాద్‌ వసీమ్‌ (10 నాటౌట్‌) సాయంతో జట్టును విజయపథంలో నడిపించాడు. కరాచీ 18.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. అద్భుతమైన ప్రదర్శన చేసిన బాబర్​ అజామ్​ ప్లేయర్​ ఆఫ్​ ది ఫైనల్​తో పాటు ప్లేయర్​ ఆఫ్​ ది సిరీస్​గా నిలిచాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.