ETV Bharat / sports

పీఎస్​ఎల్​లో మరో ముగ్గురికి కరోనా.. టోర్నీ వాయిదా - పీఎస్​ఎల్​లో కరోనా కేసులు

పాకిస్థాన్​ సూపర్​లీగ్​ను వాయిదా వేస్తున్నట్లు పాక్​ క్రికెట్​ బోర్డు గురువారం ప్రకటించింది. టోర్నీలో పాల్గొన్న ఏడుగురికి కరోనా సోకడం వల్ల లీగ్​ను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నట్లు పీసీబీ తెలిపింది.

PSL 6 postponed after string of positive Covid-19 cases
పీఎస్​ఎల్​లో మరో ముగ్గురికి కరోనా.. టోర్నీ వాయిదా
author img

By

Published : Mar 4, 2021, 3:45 PM IST

ఫిబ్రవరి 20 నుంచి ఆర్భాటంగా ప్రారంభమైన పాకిస్థాన్​ సూపర్​లీగ్​కు ఊహించని షాక్​ తగిలింది. టోర్నీలో ఏడుగురికి కరోనా సోకడం వల్ల లీగ్​ను వాయిదా వేస్తున్నట్లు పాకిస్థాన్​ క్రికెట్​ బోర్డు గురువారం ప్రకటించింది. ఇందులో ఆరుగురు ఆటగాళ్లు ఉండగా.. ఒక సహాయక సిబ్బంది ఉన్నారు.

"ప్రస్తుత పరిస్థితులను నేపథ్యంలో దృష్టిలో ఉంచుకుని ఫ్రాంచైజీలతో పాటు ఆరోగ్య అధికారులతో సమావేశం నిర్వహించాం. వారితో మాట్లాడిన తర్వాత పాకిస్థాన్​ సూపర్​లీగ్​ ప్రస్తుత సీజన్​ను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నాం.

- పాకిస్థాన్​ క్రికెట్​ బోర్డు

టోర్నీలో ఇంతకుముందు నాలుగు కొవిడ్​ కేసులు నమోదవ్వగా.. గురువారం తాజాగా మరో ముగ్గురు ఆటగాళ్లకు కరోనా సోకినట్లు పీసీబీ తెలిపింది. కరోనా సోకిన ఆటగాళ్లందర్నీ ప్రస్తుతం ఐసోలేషన్​కు పంపినట్లు​ బోర్డు వెల్లడించింది.

పాకిస్థాన్​ సూపర్​లీగ్​.. ఫిబ్రవరి 20 నుంచి ప్రారంభమైన తర్వాత ఇప్పటివరకు 14 మ్యాచ్​లు జరిగాయి. మరో 20 లీగ్​ మ్యాచ్​లను నిర్వహించాల్సిఉంది.

గతేడాది జరిగిన పీఎస్​ఎల్​ 5వ సీజన్​నూ కరోనా కారణంగా వాయిదా వేయగా.. మిగిలిన మ్యాచ్​లను నవంబరులో నిర్వహించారు. లీగ్​ ముగిసిన తర్వాత పాకిస్థాన్​ జట్టు న్యూజిలాండ్​ పర్యటనకు వెళ్లగా అక్కడ 9 మంది పాక్​ క్రికెటర్లకు కరోనా సోకింది.

ఇదీ చూడండి: పీఎస్​ఎల్​లో మరో ముగ్గురికి కరోనా పాజిటివ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.